అంబానీఇంట పెళ్లి సందడి షూరూ అయ్యింది. బిజినెస్ టైకూన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani)చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani) రాధిక మర్చంట్ (Radhika Marchant )ల పెళ్లి మరి కొద్ది గంటల్లో జరగనుంది. దేశంలోనే కనీవిని ఎరుగని రీతిలో ఈ పెళ్లి జరుగుతోంది. భారతీయ హిస్టరీ లోనే తొలిసారిగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ వివాహాన్ని అంబానీ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.
దేశంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. అంబానీల స్వస్థలం అయిన గుజరాత్(Gujarath ) జామ్‌నగర్(Jaam Nagar )లో మార్చి 1 నుంచి వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా స్టార్ట్ అయ్యాయి. వరల్డ్ వైడ్ గా ఉన్న ఫిల్మ్ సెలబ్రేటీలు, బిజినెస్ టైకూన్స్ , దేశవిదేశాలకు చెందిన ప్రెసిడెంట్ లు , మాజీ ప్రధానులతో పాటు పలు దిగ్గజ కంపెనీల సీఈఓలు ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొననున్నారు.
ప్రీ వెడ్డింగ్ లో ఆదరగొట్టిన రిహాన్నా :
ప్రీవెడ్డింగ్ వేడుకల్లో అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగ్ రిహాన్నా (Rihanna )స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తన పవర్ ఫుల్ పర్ఫామెన్స్‌తో పెళ్లి వేడుకలకు వచ్చిన అతిథులను ఆకట్టుకుంది. ఆమె పాప్ మ్యూజిక్ విని అతిథులు ఊగిపోయారు. అంబానీ ఫ్యామిలీ(Ambani Family )కూడా స్టేజి మీదకు చేరుకుని ఎంజాయ్ చేసింది.
పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అనంత అంబానీ(Anant Ambani), రాధిక మర్చంట్(Radhika Marchant )లు కూడా ఫుల్ ఖుషి అయ్యారు. అనంత్ వెడ్డింగ్ లో పెర్ఫార్మ్ చేసేందుకు గురువారమే తన టీంతో జామ్‌నగర్ చేరుకుంది రిహాన్నా. ఈ పాప్ సింగర్ ఇండియా కు వచ్చినప్పుడు తన లగేజ్ చూసి అంతా షాక్ అయ్యారు. భారీ క్రేన్స్‌లో క్యాస్ట్యూమ్స్‌తో రిహాన్నా ఇండియాలో ల్యాండ్ అవ్వడం చూసి అంతా అవాక్కయ్యారు.
పర్ఫామెన్స్ కు రూ. 74 కోట్ల రెమ్యూనరేషన్ :
ఇదిలా ఉంటే ఈ పర్ఫామెన్స్ కోసం అంబానీ ఫ్యామిలీ రిహాన్నాకు (Rihanna )ఎంత డబ్బు చెల్లించిందని తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.ఇక ఈ పాప్ సింగర్ కు చెల్లించే అమౌంట్ తెలుసుకుని కళ్ళు తేలేస్తున్నారు. ప్రీవెడ్డింగ్‌లో ఆమె పర్ఫామెన్స్ కోసం అంబానీ ఫ్యామిలీ అక్షరాలా 8 నుంచి 9 బిలియన్ డాలర్లు చెల్లించినట్టు సమాచారం. అంటే భారతీయ కరెన్సీలో రూ. 66 కోట్ల నుంచి రూ. 74 కోట్లు అన్నమాట. కేవలం రిహాన్నా మాత్రమే కాదు, ఆమెతో పాటు పలువురు ఫేమస్ సింగర్స్ కూడా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పర్ఫార్మ్ చేయనున్నారు.
2500 రకాల వంటకాలతో విందు భోజనం :
మూడు రోజుల పాటు జరగనున్న అనంత్, రాధికల పెళ్లి వేడుక కోసం అంబానీ ఫ్యామిలీ అతిరథ మహరథుల కోసం ఘుమఘమలాడే విందు భోజనాన్ని వడ్డించనున్నారు. సుమారు 2500 రకాల వంటకాలతో గెస్టులకు ఆతిద్యం ఇవ్వనున్నారు . ఇందుకోసమే ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 25 మంది చెఫ్‌ల బృందాన్ని జామ్‌నగర్‌కు రప్పించింది అంబానీ ఫ్యామిలీ.
పార్సీ నుంచి థాయ్ వరకు, మెక్సికన్ నుంచి జపనీస్ వరకు అన్ని రకాల వెరైటీలు సిద్ధం చేశారు. కేవలం వంటల కోసమే రూ. 1000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.