Popular Malayalam actress passed away: ప్రముఖ మలయాళ నటి, సంగీత స్వరకర్త సుబ్బలక్ష్మి గారు కన్నుమూత.

Popular Malayalam actress and music composer Subbalakshmi passed away

Popular Malayalam actress passed away: ప్రముఖ మలయాళ నటి, సంగీత స్వరకర్త సుబ్బలక్ష్మి గారు కన్నుమూత.

ప్రముఖ మలయాళ నటి, కర్ణాటక సంగీత విధ్వంసురాలు, అందరి ఇళ్లలో ఒక అమ్మమ్మలాగా గుర్తుండిపోయే ఆర్. సుబ్బలక్ష్మి ఈ గురువారం అంటే 30 నవంబర్ 2023న మృతిచెందారు.

కొద్దీ రోజుల క్రితం అస్వస్థతో హాస్పిటల్ లో చేరారు. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం విషమించడంతో మరణించారు.చనిపోయేనాటికి ఆమె వయసు 87 సంవత్సరాలు.

సుబ్బలక్ష్మి ఏప్రిల్ 21 1936లో కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. సినీనటి, సంగీత స్వరకర్తగా పని చేసారు.ఆమె కల్యాణకృష్ణని పెళ్లి చేసుకుంది. వీళ్ళకి ముగ్గురు పిల్లలు. అందులో ఒకరు సినీపరిశ్రమకు బాగా సుపరిచితులైన తారా కళ్యాణ్.

సినీపరిశ్రమలోకి రాకముందు సుబ్బలక్ష్మి జవహర్ బాల భవనంలో సంగీత మరియు నృత్య శిక్షకురాలు.
1951లో ఆల్ ఇండియా రేడియోలో కూడా పని చేసారు. ఆల్ ఇండియా రేడియోలో దక్షిణ భారతదేశంలో మొదటి మహిళా స్వర కర్త సుబ్బలక్ష్మినే.

సుబ్బలక్ష్మి తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్ భాషలలో నటించారు.
గౌతమ్ మీనన్ యొక్క విన్నై తాండి సినిమాలో వాయువాయాలో ఆమె పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది.

తరువాత అమ్మని అనే సినిమాలో టైటిల్ రోల్ లో నటించినందుకు ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.
సుశాంత్ రాజపుత్ కి అమ్మమ్మగా హిందీ చిత్రంలోకి ప్రవేశించింది. ఏక్ దీవానా థా మరియు దిల్ బేచారా లాంటి చిత్రాలలో నటించింది.

ఆల్ ఇండియా రేడియోలో రిటైర్ అయిన తర్వాత సినిమాల్లోకి ప్రవేశించింది. ఆమెకు బాగా గుర్తింపునిచ్చింది ఒక హార్లిక్స్ యాడ్.రెండు దశాబ్దాల నటన కాలంలో దాదాపు 75 కు పైగా సినిమాల్లో నటించింది.

సుబ్బలక్ష్మి సినిమాల్లోనే కాదు, దూరదర్శన్ ,సిరీయల్స్ లో నటించేవారు. చాలా ప్రకటనల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆమె చివరి సినిమా విజయ్ నటించిన బీస్ట్.

ఆమె చనిపోయాక ఆమె మనవరాలు సౌభాగ్య వెంకటేష్ ఒక చిత్రం ద్వారా ఈ విషయాన్నీ నెటిజన్లతో పంచుకున్నారు.

” నేను ఆమెను పోగొట్టుకున్నాను. మా అమ్మమ్మ, సుబ్బు, నా బిడ్డ… ” అంటూ బావోద్వేగంగా హాస్పిటల్ లోని చిత్రాన్నిఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

తెలుగు చిత్రాలు :

 • కల్యాణ రాముడు
 • ఏం మాయ చేసావే

హిందీ చిత్రాలు:

 • జగత్ జోగిని మా ఖోడియార్
 • ఏక్ దీవానా థా
 • దిల్ బేచారా

మలయాళ చిత్రాలు:

 • ఆరోహణం
 • నందనం
 • కల్యాణరామన్
 • తిలక్కం
 • గ్రామఫోన్
 • సౌదామిని
 • మూసా
 • మాణిక్యాన్
 • రప్పకల్
 • పందిప్పాడ
 • క్లాస్ మేట్స్
 • నోట్ బుక్
 • కలభం
 • రావణన్
 • రోమియో
 • అలీ భాయ్
 • చాక్లేట్
 • మూళ్ళ
 • మేఘ తీర్థం
 • చట్టంబినాడు
 • యుగ పురుషన్
 • మరిక్కుండురు కుంజాడు
 • నీలాంబరి
 • నోట్ అవుట్
 • లక్ష్మి విలాసం రేణుక మకాం రఘురామ్
 • తలసమయం ఓరు పెంకుట్టి
 • లోడ్ షెడ్డింగ్
 • ఓరు యాత్రిల్
 • సౌండ్ థామా
 • స్వసం
 • కూతరా
 • చెఱుక్కనుం పెన్నుమ్
 • ప్రణయకథ
 • అవరుడే వీడు
 • నక్షత్రాలు
 • 69
 • మురుక్కు
 • చిరకోడింజ కినవుకల్
 • రుద్రా సింహాసనం
 • ఓరు న్యూ జెనెరేషన్ పాణి
 • రాణి పద్మిని
 • ఇవాన్ మర్యాదరామన్
 • ఆకాశవాణి
 • కలం పరంజతు
 • జాక్ అండ్ డేనియల్
 • తేరోట్టం
 • ఒకటి
 • స్టార్
 • పచ్చతప్పు
 • చెక్కరప్పజం
 • ఓరు వత్తిల్ కొట్టా
 • కాకన్
 • మళ్లనుం మాతేవనుమ్

తమిళ చిత్రాలు :

 • ఓరు పొన్ను ఒరు పైయన్
 • రామన్ తేడియా సీతై
 • విన్నైతాండి వరువాయా
 • ఒరే ఓరు రాజా మొక్క రాజా
 • అమ్మని
 • హౌస్ ఓనర్
 • బీస్ట్

కన్నడ చిత్రాలు :

 • హోంగనాసు

సంస్కృత చిత్రం :

 • మధురస్మితం

ఇంగ్లీష్ చిత్రం :

 • భగవంతుని పేరున

Leave a Comment