కృతిమంగా పండిచిన మామిడి పళ్ళ బుట్టలు స్వాధీనం – ఇవి చాల డేంజర్ !

website 6tvnews template 2024 03 21T135656.474 కృతిమంగా పండిచిన మామిడి పళ్ళ బుట్టలు స్వాధీనం - ఇవి చాల డేంజర్ !

టీవల హైదరాబాద్ పోలీసులు రైడ్ చేసి ఇలా రసాయనాలు చల్లిన మామిడి పళ్ళ బుట్టలను స్వాధీనం చేసుకున్నారు. చాల ప్రమాదకరమైన పొటాషియం పర్మంగనేట్ అనే రసాయనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక రసాయనాల చల్లిన మామిడి పళ్ళ గురంచి చూసినట్లయితే,సమ్మర్ వస్తోందంటే చాలు అందరికి హడల్. ఎండలకి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అయితే ఈ ఎండల నుండి ఉపశమనం పొందడానికి చాలామంది అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.

కొందరు కూల్ డ్రింక్స్ తాగితే మరి కొందరు కొబ్బరిబొండం నీళ్ళు తాగి సేద తీరతారు. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం కొందరు పుచ్చకాయ ముక్కలు కూడా తింటారు. అయితే ముఖ్యం గా ఈ కాలం కొన్నింటికి ప్రత్యేకం అని చెప్పాలి అందులో ముందు వరసలో ఉండేవి మామిడి పళ్ళు, ఈ కాలం లో ఆడవారికి మాత్రమే దొరికే పందిరి మల్లి పువ్వులు. ఇక మామిడి పళ్ళ విషయానికి వస్తే ఇందులో ఎన్నో రకాల పళ్ళు దొరుకుతాయి. పెద్ద రసాలు, చిన్న రసాలు, బంగిన పల్లి ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. కాని ఈ మామిడి పళ్ళు స్వతహాగా పండితే పర్వాలేదు, మన ఆరోగ్యం కు ఎం కాదు. కాని పండ డానికి సమయం పడుతుంది.

కొందరు తొందర అధిక లాభాలు చూడాలని ఆశతో మామిడి పళ్ళను కృతిమ పద్ధతి లో వాటిని పండేల చేసి మార్కెట్ లోకి తీసుకువస్తున్నారు. కాని ఈ కృతిమ పద్ధతి అంటే పచ్చిగా ఉన్న మామిడి పళ్ళ మీద కొన్ని రకాల రసాయనాలు చల్లడం వల్ల అవి తొందరగా పందిపోతాయి. కాని వాటిని కొనుక్కుని తినేవారికి ఈ విషయం తెలియక వాటిని తినేస్తున్నారు.

దీని వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కొంత మంది లో కిడ్నీ లు చెడిపోయే ప్రమాదం ఉంది. ఈ మధ్యకాలం లో వీటి మీద పరిశోధనలు చేసినపుడు ఈ మామిడి పళ్ళ మీద చాల్లే రసాయనాల వల్ల కాన్సెర్ లు కుడా వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రజ్ఞులు చెప్పారు. ఇలాంటి మామిడి పళ్ళను గుర్తించడం కూడా తేలికే, ఎలాగంటే రసాయనాలు చల్లిన మామిడి పళ్ళు తియ్యగా ఉండవు. వగరు గా ఉంటాయి.

Leave a Comment