Prabhas Landed In Hyderabad : హైదరాబాద్ లో ల్యాండ్ అయిన డార్లింగ్..సాలార్ ఫీవర్ షురూ అవ్వనుందా.సాలార్ విషయంలో మేకర్స్ ఎం చేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియా లో లాండ్ అయ్యాడు. గత నెల రోజుల నుండి రెస్ట్ మోడ్ లో ఉన్న ప్రభాస్ ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చేశాడు.
మోకాలికి సర్జరీ చేయించుకున్న ప్రభాస్ విశ్రాంతి అనంతరం సాలార్ సినిమా ప్రమోషన్లకు రెడీ అవుతున్నాడు. కన్నడ సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై డార్లింగ్ ఫాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఈ సినిమాను ముందుగా అనుకున్నదాని ప్రకారం అయితే సెప్టెంబర్ నెలలో విడుదల చేయాల్సి ఉంది. కానీ మేకర్స్ రాజీపడని మనస్తత్వం కలవారు అవ్వడంతో వి.ఎఫ్.ఎక్స్ పనులను ఇంకా కొనసాగిస్తున్నారు.
అందుకే సెప్టెంబర్ లో విడుదల కావలసిన సాలార్ సినిమా డిసెంబర్ లో విడుదలవుతోంది. ఏది ఏమైనా సరే బొమ్మ బ్లాక్ బస్టర్ కావాల్సిందే అన్న లక్ష్యంతో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నట్టు అర్ధం అవుతోంది.
ఒకప్పుడు మన తెలుగు సినిమాల లైన్ తీసుకుని హిందీ చిత్రసీమలో సినిమాలు రీమేక్ చేసుకునే వారు కానీ ఇప్పుడు మన తెలుగు సినిమా మాస్ మసాలా యాక్షన్ సీక్వెన్సులను బాగా ఇష్టంగా చూస్తున్నారు ఉత్తరాది ప్రేక్షకులు.
అందుకు ఉదాహరణే బాహుబలి, పుష్ప, ట్రిపుల్ ఆర్, కార్తికేయ 2. ఈ సినిమాలు ఉత్తరాది వారిని ఒక ఊపు ఊపేసాయి. ఇక ప్రభాస్ సినిమాలకి అక్కడ మంచి మార్కెట్టే ఉంది.
ఇక కెజిఎఫ్ కూడా నార్త్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకోవడంతో ప్రశాంత్ నీల్ సినిమా అంటే అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. కాబట్టి ప్రభాస్ సినిమాను ఎక్కడ కంప్రమైస్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. కొన్ని సీన్లను కూడా రీ షూట్ చేసినట్టు తెలుస్తోంది.
ఇక ప్రభాస్ తోపాటు కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కూడా డిసెంబర్ 22 నే తన తాజా చిత్రం డుంకి ని రిలీజ్ చేయాలనుకున్నారు అయితే సడన్ గా ఏమైందో ఏమోకానీ అయన తన సినిమాను క్రిస్మస్ రోజున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
షారుక్ గత చిత్రాలు పఠాన్, జవాన్ లు మంచి విజయాన్నే అందుకున్నాయి. ఇక ప్రభాస్, మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా డీలక్స్ లో కూడా నటిస్తున్నారు.
ఈ సినిమాలో డార్లింగ్, ముగ్గురు భామలతో రొమాన్స్ చేస్తాడట. అలాగే సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న కల్కి లో కూడా ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.