Prabhas Next Movie Spirit – Animal Heroiens : ఇటీవల సలార్ మూవీ తో హిట్ కొట్టిన ప్రభాస్ తన మిగిలిన ప్రాజెక్ట్స్ లో కల్కి, రాజసాబ్, సలార్ 2 లు పూర్తి అవ్వగానే సందీప్ రెడ్డి వంగా డైరక్షన్ లో స్పిరిట్ మూవీ ని చెయ్యబోతున్నాడు. అయితే ఈ సంవత్సరం లోనే తన మూవీ సెట్స్ పైకి వెళ్తుందని యానిమల్ ప్రమోషన్స్ లో అనౌన్సు కూడా చేసాడు.
అయితే తన స్పిరిట్ మూవీ లో నటించే హీరోయిన్స్ గురుంచే చర్చ నడుస్తోంది ఇప్పుడు. ఇందులో త్రిప్తి డిమ్రి కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ రేసు లో రష్మిక మందన కూడా ఉన్నట్లు అనే వార్త హల్చల్ చేస్తోంది.
దీనికి బలమైన కారణం చెప్తున్నాయి సినీ వర్గాలు యానిమల్ మూవీ లో రష్మిక మందన డెడికేషన్ తన నటన కి సందీప్ రెడ్డి వంగ చాల సాటిస్ఫై అయ్యాడని అందుకే ఆమెకి ఇందులో అవకాశం తప్పకుండ ఉంటుందని అనుకుంటున్నారు. మరి ప్రభాస్ కోసం ఏ హీరోయిన్ ని సందీప్ రెడ్డి వంగా ఫిక్స్ చేస్తాడో అని అందరు ఆత్రుత గా ఎదురుచూస్తున్నారు. మరి చూద్దాం ప్రభాస్ పక్కన ఎవరు నటిస్తారో