Prabhas Raja Saab movie release Date latest update : ప్రభాస్ ఫ్యాన్స్‎కు డబుల్ ట్రీట్.’రాజా సాబ్ ‘ నుంచి సాలిడ్ అప్‎డేట్

website 6tvnews template 100 Prabhas Raja Saab movie release Date latest update : ప్రభాస్ ఫ్యాన్స్‎కు డబుల్ ట్రీట్.'రాజా సాబ్ ' నుంచి సాలిడ్ అప్‎డేట్

Prabhas Raja Saab movie release Date latest update : గత కొంత కాలంగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు వెంటాడినా..లేటెస్టుగా సలార్ మూవీతో సెన్సేషనల్ హిట్ సాధించి ఫుల్ ఖుషీలో ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్. గత సంవత్సరం డిసెంబర్ 22న విడుదలైన సలార్ (Salaar)మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ముదులిపింది.

రూ.250 కోట్లతో ప్రశాంత్ నీల్ (Prashanth Neil)రూపొందించిన ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.600 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి ప్రభాస్ కి మంచి కంబ్యాక్ ఇచ్చింది.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక ఓ వైపు సలార్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు తన చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టులను వరుసగా చేస్తూ బిజీ హీరోగా మారిపోయాడు రెబల్ స్టార్.

మహానటి (Mahanati) ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin)తో కలిసి కల్కి (Kalki) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీనితో పాటే ప్రభాస్ మారుతి (Maruthi) డైరెక్షన్ లో రాజా సాబ్ (Raja Saab) సినిమాలో నటిస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఈ రెండు సినిమాలు ఒకే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ‘కల్కి’ మేకర్స్ సినిమాను మే 9న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.

ఇక మారుతి డైరెక్షన్ లో వస్తున్న ‘రాజా సాబ్’ సినిమా విషయానికి వస్తే టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ తప్పితే మరో అప్డేట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ‘రాజా సాబ్’ రిలీజ్ డేట్ పై ఆసక్తికర న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Raja Saab will be released on Christmas?: క్రిస్మస్‎కి రాజా సాబ్ రిలీజ్?

https://twitter.com/taran_adarsh/status/1746708315827302468?s=20

ప్రతి సంవత్సరం రెండు సినిమాలను విడుదల చేస్తూ ప్రభాస్ (Prabhas) తన అభిమానులను అలరిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఓం రౌత్ (Om Raut)డైరెక్షన్‎లో ఆదిపురుష్ (Adipurush), ప్రశాంత్ నీల్ (Prashanth Neil) డైరెక్షన్‎లో వచ్చిన సలార్ (Salaar) సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఇక ఈ కొత్త సంవత్సరంలో నాగ్ అశ్విన్ (Nag Ahswin)డైరెక్షన్ లో కల్కి (Kalki), మారుతి (Maruthi )డైరెక్షన్ లో వస్తున్న రాజా సాబ్ (Raja Saab)మూవీస్ తో ఫ్యాన్స్ ను డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడని ట్రేడ్ వర్గాల ఇన్సైడ్ టాక్.

రాజా సాబ్ మూవీని ఈ ఏడాది క్రిస్మస్ (Christmas) కి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా విడుదల తేదీపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

క్రిస్మస్ కి కనుక సినిమా విడుదలైతే ఫ్యాన్స్ కు పెద్ద పండుగే.

Maruti entering into Pan India market : పాన్ ఇండియా మార్కెట్‎లోకి మారుతి


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానెర్ పైన రాజా సాబ్ మూవీని టీజీ విశ్వప్రసాద్ (TG Vishwaprasad) ప్రొడ్యూజ్ చేస్తున్నారు.

ఈ మధ్యనే మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. రాజా సాబ్(Raja Saab)లో ప్రభాస్ (Prabhas) కి హీరో కాగా నిధి అగర్వాల్ (Nidhi Agarwal), మాళవిక మోహనన్ (Malavika Mohanan), రిద్ది కుమార్ (Riddi Kumar) హీరోయిన్స్ గా కనిపించనున్నారు. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు మారుతి.

ఫ్యాన్స్ ప్రభాస్ ని ఎలా చూడాలని కోరుకుంటున్నారో అదేవిధంగా ఈ మూవీలో డైరెక్టర్ ప్రజెంట్ చేయబోతున్నారు.

రాజా సాబ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీతో మారుతి (Maruthi) కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవుతుండటం విశేషం.

Prabhas Raja Saab movie release Date latest update

Leave a Comment