Salaar Movie Review: ప్రభాస్ ‘సలార్‌’ మూవీ రివ్యూ!

Prabhas 'Salar' Movie Review!

Salaar Movie Review: ప్రభాస్ ‘సలార్‌’ మూవీ రివ్యూ!

(prabhas salar movie review): ఒక పక్క పాన్ ఇండియా స్టార్ Prabhas , మరో పక్క ప్రశాంత్ నీల్, హీరో పరంగా చుస్తే బాహుబలి వంటి భారీ హిట్టు, డైరెక్టర్ పరంగా చుస్తే కేజీ.ఎఫ్ లాంటి ఒక పెద్ద సెన్సేషన్.

మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది అంటే ఆడియన్స్ ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకుంటారో ఆ సినిమా మీద మాటల్లో చెప్పనవసరం లేదు. కాబట్టి Salaar విషయం లో కూడా అదే రేంజ్ లో కాదు, ఊహించుకున్నదానికన్నా పది రేట్లు ఎక్కువ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.

Prabhas వంటి సూపర్ స్టార్ హీరో నుండి ఒక సినిమా వస్తోంది అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనో లేదంటే ఆడియో ఫంషన్ అనో ఎదో ఒకటి నిర్వహిస్తారని ఆశించారు.

Prabhas ఫాన్స్ ను సినిమాను దృష్టిలో పెట్టుకుని ఎం మాట్లాడతారా అని అంట ఆతృతగా ఎదురుచూస్తారు. కానీ సాలార్ విషయంలో అసలు ఆ ఊసే లేదు, డైరెక్ట్ గా సినిమా రిలీజ్ చేశారు, కేవలం టీజర్లు, ట్రైలర్లు మాత్రమే ప్రేక్షకులను ఫాన్స్ ను అలరించాయి.

అందుకే అంటారేమో కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అని. ఇక ఈ సినిమాలో తెలుగు నుండి జగపతి బాబు, పృథ్వి రాజ్ సుకుమారన్, టీను ఆనంద్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. (prabhas salar movie review) మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

Movie NameSalaar Part 1 Ceasefire
Movie CastePrabhas,
Jagapathi Babu,
Sruti Hassan,
Prudhvi Raj Sukumaran,
Boby Simha,
Teenu Anand,
Eswari Rao,
Sriya Reddy,
Music Ravi Basroor,
Cinematography Bhuvan Gowda,
EditingUjval Kulkarni,
ProducerVijay Kirangadur
Written & Direction Prashanth Neel

Salaar story:

Salaar సినిమా అనేది ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ అన్నది దర్శకుడు ప్రశాంత్ నీల్ Prashanth Neel ముందుగానే చెప్పేశారు. అయితే మొదటి భాగంలో ఈ స్నేహితులు ఎలా దగ్గరయ్యారు,

ఎవరి వల్ల ఎవరు సహాయం పొందారు, అన్నది ప్రధానాంశంగా ఉంటుంది, అయితే ప్రాణస్నేహితులు శత్రువులుగా ఎలా మారారు అన్నది తరువాత భాగంలో చూడాల్సి ఉంటుందేమో.

ఇక స్టోరీలోకి వెళితే, పృథ్వి రాజ్ సుకుమారన్ Prudhvi Raaj Sukumaran తండ్రి పాత్రలో జగపతి బాబు కనిపిస్తారు, ఖాన్సార్ Khaansar అనే సామ్రాజ్యానికి జగపతిబాబు రాజు Jagapathi Babu గా ఉంటాడు,

ఇక ఇదే రాజ్యంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో దొర ఉంటాడు, అయితే అన్ని సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలో కూడా రాజును అంతం చేసి రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని దొరలంతా ఎవరి ప్లాన్ లలో వారు ఉంటారు.

ఇక ప్రతి రాజు కి ఒక కల ఉంటుంది, తన కొడుకుని తన తరవాత రాజు గా చూడాలని, అలాగే జగపతిబాబు కూడా పృథ్వి రాజ్ సుకుమారన్ ను రాజు గా చూడాలని అనుకుంటాడు. దీంతో అసలు పృథ్వి రాజ్ సుకుమారన్ ను అడ్డు తొలగించుకోవాలని మిగతా వారు ప్రయత్నిస్తుంటారు.

ఆ ప్రయత్నాలు తార స్థాయికి చేరుకుంటాయి. (prabhas salar movie review) ఇలాంటి టైం లోనే హీరో తెరపైకి వస్తాడు. దొరలంతా తమ సైన్యాన్ని కూడగట్టుకుని పృథ్వి రాజ్ ను అంతం చేయాలని డిసైడ్ అవుతారు,

కానీ పృథ్వి రాజ్ మాత్రం తన ప్రాణ స్నేహితుడు Prabhas ను ఒక్కడినే తన సైన్యంగా నిలబెడతాడు. మరి Prabhas ఒక్కడే ఆ సైన్యాన్ని ఎలా ఎదిరించాడు.

తన బెస్ట్ ఫ్రెండ్ కోసంPrabhas ఏంచేశాడు, Prabhas కి Salaar అని పేరు ఎలా వచ్చింది. ఈ కధలో స్రుతి హాసన్ Sruti Hassan పాత్ర ఏంటి,Prabhas లైఫ్ లోకి స్రుతి ఎలా ఎంటర్ అయింది.

Prabhas పాతికేళ్ల పాటు ఒరిస్సాలో Orissa ని మారు మూల గ్రామాల్లో ఎందుకు తలా దాచుకున్నాడు. ఈ సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్ పేరు కర్త రాజమన్నార్ Karta Raja Mannar ,

ప్రుధ్వి రాజ్ సుకుమారన్ పాత్ర పేరు వరద రాజా మన్నార్ Varada Raja Mannaar ,Prabhas దేవా Deva అనే పాత్రలో కనిపిస్తాడు. ఆద్య Aadhya గా స్రుతి తెరపై కనపడుతుంది.

Movie:

ప్రశాంత్ నీల్ దర్శకత్వం అంటే యాక్షన్ సీన్స్ ఏ మేరకు ఉంటాయని మాస్ ప్రేక్షకులు ఆశిస్తారో అలంటి వాటిని ఏమాత్రం కొదువ లేదు, బ్లడ్ తో హీరో కి తలస్నానం చేయించినట్టుగానే ఉంటుంది వ్యవహారం.

కెజిఎఫ్ లో ఒక ప్రత్యేకమైన లోకాన్ని ఎలా సృష్టించాడో ఈ సారి ప్రేక్షకుల కోసం ఖాన్సార్ Khansar అనే లోకాన్ని క్రియేట్ చేశాడు. (prabhas salar movie review) సాలార్ ను ప్రశాంత్ నీల్ Prashanth Neel డైరెక్ట్ చేస్తున్నాడు అంటే కెజిఎఫ్ ను మించి ఉంటాయి హీరో ఎలివేషన్ సీన్లు అని Prabhas ఫాన్స్ అంచనాలు పెట్టుకుంటారు.

కాబట్టి డైరెక్టర్ ఆ అంచనాలను నిబెట్టుకున్నాడు. కెజిఎఫ్ Kgf కన్నా ఒక అడుగు ఎక్కువే ఉన్నాయి, కేవలం ఎలివేషనే కాదు అంతకి మించి డ్రామా ఉంది సినిమాలో.

అక్కడక్కడా కొన్ని సీన్లు కన్ఫ్యూజ్ చేసినా ఆడియన్స్ కి ఎక్కడ బోర్ కొట్టకుండా చేసుకున్నాడు. స్నేహం Friendship, రాజ్య కాంక్ష, ప్రతీకారం revenge ఈ మోడిటి చుట్టూ కథను ఎంత బాగా అల్లుకుంటే సినిమా అంతబాగా సక్సస్ అవుతుంది అని చెప్పాడనికి ఇది చక్కని ఉదాహరణ.

హీరోయిజం పీక్స్ లోకి వెళుతుంది అనుకున్న టైం లో పృథ్వి రాజ్ ఒకసారి కంట్రోల్ చేస్తాడు హీరో అకేరెక్టర్ ను, సెకండ్ ఆఫ్ లో ఈశ్వరి రావు రక్త పాతం జరగకుండా చూసుకుంటుంది, కానీ ఒక సీన్ లోPrabhas చేతికి కత్తి వెళుతుంది, ఆ సాయంలో యాక్షన్ ఎపిసోడ్ ఎక్స్ట్రా లెవెల్ లో ఉంటుంది.

Performance:

Add a heading 2023 12 22T113848.424 Salaar Movie Review: ప్రభాస్ 'సలార్‌' మూవీ రివ్యూ!

Prabhas ను చాలా చక్కగా వాడుకున్నాడు డైరెక్టర్, ఆ కటౌట్ కి తగ్గ యాక్షన్ సీన్లు పెట్టి మరో సారి ఫాన్స్ కి ఐ ఫీస్ట్ ఇచ్చాడు. స్నేహితుని మాట జవదాటని మనిషిగా,

తల్లి చాటు కొడుకుగా కనిపించిన అదే Prabhas కత్తి పట్టి కదనరంగంలోకి దిగితే రక్త పాఠం ఎలా ఉంటుందో కూడా ఒకే సినిమా చూపించి వావ్ అనిపించాడు. (prabhas salar movie review) పృథ్వి రాజ్ సుకుమారన్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది.

శృతి హాసన్ Sruti Hassan కి సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ లేదేమో అనిపిస్తుంది కానీ ఫస్ట్ హాఫ్ లో తనే కీలకం. ఇక సీనియర్ ఆర్టిస్టులుగా పేరున్న జగపతి బాబు Jagapathi babu,

ఈశ్వరి రావు Eeswari Rao, టీను ఆనంద్ వారి వారి పాత్రలను సమర్ధవంతంగా పోషించారు. మరోవైపు శ్రీయా రెడ్డి Sriya Reddy బాబీ సింహా, మైమ్ గోపి వంటివారు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

Technical values :


ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ Back Ground Score స్కోర్ చాల ముఖ్యం, అలాగే మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవాలంటే మంచి బాణీలు Tunes కూడా ముఖ్యమే, కాబట్టి రవి బ‌స్రూర్ Ravi Basroor,

చక్కని సంగీతాన్ని అందించాడు. (prabhas salar movie review) ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఖాన్సార్ అనేది దర్శకుడి కల్పితం, కానీ ఆ కల్పితాన్ని సెట్స్ రూపంలో వేస్తె, వాటిని యదార్ధం అనుకునేలా చిత్రీకరించిన భువన్ గౌడ Bhuvan Gowda కెమెరా పని తనం అద్భుతం.

Plus Points:

ఈ సినిమాకి ప్రధాన బలం దర్శకుడి దర్శకత్వ ప్రతిభ, Prabhas కటౌట్ కి ఉన్న హీరోయిజం. దానికి తోడు పృథ్వి రాజ్ సుకుమారన్ పాత్ర తోడవ్వడం, ఇక నటీనటులు పండించిన నటన, కధలోని డ్రామా.

Draw backs :

ఈ ఈసినిమా చూస్తున్నప్పుడు అక్కడక్కడా కెజిఎఫ్ గుర్తొస్తుంది, పైగా కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉంటాయి, ప్రేక్షకుడిని తికమక చేస్తాయి.

Leave a Comment