Hero Prabhas: ప్రభాస్ అప్పటి వరకు బయటికి రాడు..షూటింగులు స్టార్ట్ అయ్యే డేట్ ఎప్పుడంటే.
రెబల్ స్టార్ ప్రభాస్ ను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డార్లింగ్ తన మోకాలికి యూరప్ వెళ్లి సర్జరీ చేయించుకుని అక్కడే ఒక నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుని వచ్చాడు. హైదరాబాద్ వచ్చాక కూడా ప్రభాస్ బయటకే రాలేదు.
దీంతో అభిమానులు ప్రభాస్ ను చూడకుండా ఉండలేకపోతున్నారు. సినిమా షూటింగ్స్ కి గాని ప్రమోషన్ కార్యక్రమాలకు గాని ప్రభాస్ అస్సలు అటెండ్ కావడం లేదు.
దీంతో ఫాన్స్ అతని పై బెంగ పెట్టుకున్నారు. వెండితెరమీద కనిపించే సంగతి తరవాత కనీసం సోషల్ మీడియాలో అయినా ఒక్కసారి కనిపించు అంటూ వేడుకుంటున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఇక్కడ కూడా ఒక నెల పాటు రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట.
ఎందుకంటే ప్రభాస్ మోకాలికి సర్జరీ చేశారు. ఆ మోకాలి నొప్పి ఇప్పటిది కాదు. బాహుబలి సినిమా సమయంలో తీరిక లేకుండా పోరాట సన్నివేశాలు చేస్తున్న సమయంలో ప్రభాస్ కి మోకాలి నొప్పి మొదలైంది.
అయితే ఆ మోకాలి నొప్పి తోనే సాహా, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు పూర్తి చేశాడు. అయితే సాలార్ సినిమాను కూడా దాదాపు ఈ నొప్పితోనే ముగించాడు. కానీ చివర్లో రెండు సాంగ్స్ మాత్రం బాలెన్స్ ఉండిపోయాయట.
కాబట్టి ప్రభాస్ ఆ రెండు సాంగ్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది. కానీ ప్రభాస్ డిసెంబరు 1న జరిగే ‘సలార్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వరకు రెస్ట్ టీసుకోవడం కంటిన్యూ చేస్తాడట. సాలార్ ట్రైలర్ లాంచ్ టైం కె బయటకు వస్తాడని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ కల్కి, రాజా డీలక్స్, సినిమాలకు పనిచేస్తున్నాడు. అయితే ఆ సినిమాలకు కూడా ప్రభాస్ బ్రేక్ ఇచ్చేశాడు. అవి కూడా డిసెంబర్ 1 తరవాతే మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రభాస్ లేకుండా చేసే సీన్లను డైరెక్టర్స్ ప్లాన్ చేసుకోవాలి.
ఏది ఏమైనా ప్రభాస్ ఫాన్స్ మాత్రం బాహుబలి తరువాత నుండి అంతటి స్థాయి హిట్టుకోసం వెయిట్ చేస్తున్నారు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు నిరాశపరిచాయి. కాబట్టి ఇప్పుడు రాబోయే సాలార్ గట్టి కొట్టాలని కోరుకుంటున్నారు. పైగా ఈ సినిమాకి కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉండటం తో హిట్టు పక్కా అనే హోప్స్ పెట్టుకున్నారు.
పాన్ ఇండియా స్థాయి లో వస్తున్న ఈ సినిమాలో మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్లుగా కనిపించబోతున్నారు.
కాగా ప్రభాస్ ఈ సినిమాలో స్రుతి హస్సన్ తో తొలిసారి జోడీ కడుతున్నాడు. ఇక స్రుతి హస్సన్ కూడా ఈ మధ్య వరుస హిట్లతో దూసుకెళుతోంది. ఇక ప్రభాస్ కొత్త సంవత్సరం డైరీని క్రేజీ ప్రాజక్టులతో నింపాలని చూస్తున్నాడట.