ప్రధానమంత్రి సూర్యోదయ యోజన – కోటి కుటుంబాలకు లబ్ది : Pradhanmantri Suryodaya Yojana

Pradhanmantri Suryodaya Yojana

Pradhanmantri Suryodaya Yojana : మనదేశంలో రాను రాను ఇంధనం ధరలు పెరిగిపోతున్నాయి, ఇంధనానికి మరో ప్రత్యామ్నాయం విద్యుత్తూ, ఈ విద్యుత్తు చార్జీలు కూడా ఇప్పుడిప్పుడే క్రమేపి పెరగడం మొదలయ్యాయి. వీటన్నికి కేంద్ర సర్కారు నెమ్మదిగా ఫుల్ స్టాప్ పెట్టనుంది. అందుకే సౌర విద్యుత్తు ఉత్పత్తి కోసం అడుగులు వేస్తోంది.

అయితే దీనిని ప్రభుత్వం నేరుగా ఉత్పత్తి చేయదు. ప్రజలకే ఆ అవకాశాన్ని కల్పిస్తోంది. ఏకంగా కోటి కుటుంబాలను ఇందులో భాగం చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన(Pradhana mantri Suryodaya Yojana) అనే పేరుతో ఒక పధకాన్ని తెరపైకి తెచ్చింది. ఈ పధకం ద్వారా, దేశంలోని కోటి కుటుంబాలకు సోలార్ పానల్స్ ను అందించనుంది.

కోటి కుటుంబాల ఎంపిక : Pradhanmantri Suryodaya Yojana One Crore Families

అయోధ్య లో నిర్వహించిన పవిత్రోత్సవం సందర్భంగా ప్రధానమంది నరేంద్ర మోడీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశం లోని కోటి కుటుంబాలకు సోలార్ పానెల్స్ అందించడం వల్ల సౌర శక్తిని ఆయా కుటుంబాలు ఉపయోగించుకుని కొంత స్వావలంబన పొందగలుగుతాయి. దాని వల్ల వారికి ఇంధనం పై వెచ్చించాల్సిన సొమ్ము ఆదా అవుతుంది.

ఆత్మనిర్భర్ శక్తి : Atmanirbhar Shakti

ప్రపంచంలో ఆర్ధికంగా పైకి ఎదుగుతున్న వారికి మరికొంత చేయూత నివ్వడం ద్వారా వారు పేదరికం నుండి బయటపడేందుకు వీలవుతుంది. అందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన పధకం(Pradhana Mantri Suryodaya Yojana) ద్వారా ఆయా కుటుంబాల వారికి విద్యుత్తూ బిల్లు అదా అవుతుంది. తద్వారా వారు నేరుగానే లబ్ది పొందినట్టవుతుంది. అందుకే ఈ పథకంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ ను ఎంకరేజ్ చేయడం వల్ల చాలా మంది లబ్ది పొందేందుకు వీలవుతుంది. ఈ పధకం ద్వారా మిడిల్ క్లాస్ అలాగే లోవర్ మిడిల్ క్లాస్ వారు కరెంటు బిల్లులను ఆదా చేసుకునేందుకు వీలవుతుంది. దీని వల్ల వారికి కొంత మొత్తం మిగిలినట్టవుతుంది,

ప్రజా అవగాహనా కార్యక్రమం : Pradhanmantri Suryodaya Yojana Awareness To People

దేశ వ్యాప్తంగా ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టం ను ఉపయోగించుకునే విధంగా ఎక్కువ మందిని ప్రోత్సహించాలని ప్రధానమంత్రి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇలా ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఎక్కువ మంది ఈ రూఫ్ టాప్ సోలార్(Roof Top Solar- Pradhanmantri Suryodaya Yojana ) విధానాన్ని ఇన్ స్టాల్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఇది అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఇద్దరికీ ఉభయతారకంగా ఉంటుంది. ప్రజలకు విద్యుత్ బిల్లు అదా అవుతుంది అంటే, పరోక్షంగా ప్రభుత్వం నుండి సప్లయ్ అవుతున్న విద్యుత్ వాడకం తగ్గినట్టే కదా, అందుకే దీనిని ఎక్కువ మందికి చేరువయ్యేలా చేసేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.

ఎంత ఖర్చు : How Much Cost for Pradhanmantri Suryodaya Yojana

ఎక్కువ మందిలో ఉన్న సందేహం ఏమిటంటే ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టం ను మన ఇంటిపై బిగించుకోవాలంటే(Installation Of Roof Top Solar System) ఎంత ఖర్చవుతుంది, ప్రభుత్వం ఎంతమేర సబ్సిడీ ఇస్తుంది ? లేక ఇది పూర్తిగా ఉచితమా అని డౌట్స్ వస్తుంటాయి. ఇది పూర్తిగా ఉచితం అయితే కాదు. దీనికోసం ప్రభుత్వ 40 శాతం ఆర్ధిక సహాయం అందిస్తుంది. 60 శతం ఖర్చు మనం పెట్టుకుని పధకాన్ని అందిపుచ్చుకోవచ్చు.

Leave a Comment