Pragathi Bhavan Gates Lifted: ప్రగతిభవన్‌ గేట్లు తొలగింపు

maxresdefault 7 Pragathi Bhavan Gates Lifted: ప్రగతిభవన్‌ గేట్లు తొలగింపు


సామాన్యులకోసం ఇకపై ప్రగతిభవన్ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి..

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రమంలో ప్రగతి భవన్ వద్ద ఉన్న బారికేడ్లు తొలగించి ఆంక్షలను తొలగించింది.

ఈ క్రమంలోనే ప్రగతిభవన్ ముందు ఉన్న బారికేడ్లను అధికారులు ఎత్తేసే పనిలో నిమగ్నమయ్యారు.
జేసీబీలు, గ్యాస్ కట్టర్ల సాయంతో ఈ బారికేడ్ల తొలగింపు చేస్తున్నారు.
ఈ బారీకేడ్లతో పాటు పక్కన ఉన్న షెడ్, గ్రిల్స్ అన్ని తొలగిస్తున్నారు.
ఇక బారికేడ్లు తొలగిస్తూ ఆ దారిలో వాహనాలు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇస్తున్నారు.

ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ కొత్త ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడని తెలిసిందే. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రేస్ అగ్ర నేతలైన సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తదితరులు హాజరుకానున్నారు.

కాంగ్రేస్ ఇంకా అధికారాన్ని చేతిలోకి తీసుకోకముందే రాష్ట్రంలో అనేక చర్యలు తీసుకుంటుంది. ప్రగతిభవన్ చుట్టూ ఉన్న కంచెలు కొల్లగొట్టి, సామాన్య ప్రజలకోసం ప్రగతిభవన్ ఎప్పుడు తెరచి ఉంటుందని, ప్రజల సమస్యలు వినేందుకు ప్రగతిభవన్ ద్వారాలు తెరచి ఉంటాయని చెప్తున్నారు.

అయితే కాంగ్రేస్ పాలనపైనే క్లారిటీ రాగానే రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ గురించి ప్రస్తావిస్తూ, సామాన్య ప్రజల సమస్యలు వినడానికి సచివాలయం, ప్రగతిభవన్ ఎప్పడు తెరచే ఉంటుందని చెప్పాడు.

అయితే ఈ కంచెలు తెంచే నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రజాపాలన నిజంగా వచ్చిందంటూ రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటున్నారు.

కాంగ్రేస్ పాలనలో ప్రజలు నేరుగా ప్రగతిభవన్ కి వచ్చేందుకే అలా బారికేడ్లు తొలగించారని కాంగ్రేస్ నేతలు అన్నారు.

ఇంతకుముందు సీఎంగా కెసిఆర్ ఉన్నపుడు ప్రగతిభవన్ లోకి సామాన్యులని రానివ్వలేదని, తాను అధికారంలోకి వస్తే అలాంటి ఆంక్షలను ఎత్తివేస్తానని రేవంత్ రెడ్డి అనేకసార్లు అన్నారు, ప్రమాణస్వీకారానికి ముందే ఆ పని చేయడంతో తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషంగా ఈ మార్పుని ఆహ్వానిస్తున్నారు

Leave a Comment