Praja Durbar started: గడీ కంచ పఠాపంచలైంది .. ప్రజా దర్బార్ షురూ అయింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెను తీసివేయిస్తామని, ప్రగతి భవన్ లోకి సామాన్య ప్రజలను అనుమతిస్తామని చెప్పారు.
రేవంత్ రెడ్డి ఆడిన మాటను నిలబెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఎన్నికల ఫలితాలు తేలిన వెంటనే, ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణకు ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు.
అయితే చెప్పిన మాటను రేవంత్ రెడ్డి తూచా తప్పకుండా పాటించారు. ఒక ప్రక్క ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే మరో ప్రక్క ప్రగతి భావన్ ముందున్న కంచెను తొలగించేందుకు బొల్డోజర్లు వచ్చేశాయి.
వెల్డింగ్ మెషీన్లు కట్టర్లతో కంచెను తిలగించారు.రోడ్డు కి అడ్డంగా ఉన్న గోడలను తొలగించి ప్రజా ప్రవేశానికి మార్గం సుగమం చేశారు.
అక్కడితో ఆగకుండా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుండే అంటే డిసెంబర్ 8వ తేదీ నుండే ప్రజలకు ప్రగతి భవన్ లోకి అనుమతించేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రజలు ముఖ్య మంత్రిని కలిసేందుకు ఉదయానికల్లా వినతి పత్రాలు తీసుకుని వచ్చేశారు.
ఇక మీదట ఈ ప్రగతి భవన్ పేరును కూడా మార్చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారట, దాని పేరును జ్యోతి రావు పూలే భవన్ గా మార్చాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
నాయకులు ముఖ్య మంత్రులు అయ్యాక ప్రజా దర్బారులు నిర్వహించడం రేవంత్ రెడ్డి తోనే షురూ కాలేదు. దివంగత ముఖ్య మంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఇదే తరహా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలను నేరుగా కలుస్తూ వారి నుండి వినతి పత్రాలు స్వీకరించేవారు.
వారి సమస్యను సావకాశంగా విని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆజ్ఞాపించేవారు. రాజశేఖర్ రెడ్డి తరువాత ఆ స్టైల్ లో ప్రజా దర్బారు నిర్వహించిన, నిర్వహిస్తున్న నేత ఎవరైనా ఉన్నారా అంటే అది ఉత్తర్ ప్రేదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రమే, అయన కూడా ప్రజలను నేరుగా కలుస్తూ వారి నుండి వినతి పత్రాలు స్వీకరిస్తారు.
ఆయా సమస్యలను సావకాశం గా విని వాటి పరిష్కారానికి మార్గం చూపిస్తారు, కొన్నింటిని ఉన్నపళంగా పరిష్కరిస్తే మరి కొన్నింటిని అధికారులకు అప్పగించి, పరిష్కారమయ్యేలా చూస్తారు.
ప్రస్తుతం ఈ తరహా బాటలోనే పయనిస్తున్నారు తెలంగాణ తాజా సీఎం రేవంత్ రెడ్డి. ప్రగతిభవన్ ను, సచివాలయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. ఒకప్పుడు ప్రగతి భవన్ లో వాతావరణం ఇందుకు భిన్నంగా ఉండేది.
సామాన్యులు ప్రగతి భవన్ వైపు కూడా నడిచేందుకు వీలు ఉండేది కాదు, అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉండేవి. కేవలం సామాన్యులకె కాదు, ప్రజా ప్రతినిధులు కూడా అనుమతి లేకుండా, అపాయింట్మెంట్ లేకుండా లోనికి వెళ్లాలనుకోవడం అసాధ్యం అయ్యేది. అలా అపాయింట్మెంట్ లేకుండా వచ్చి అవామనాల పాలైన వారు కూడా లేకపోలేదు.