Salaar Story Reviled: సలార్  స్టోరీ చెప్పేసిన ప్రశాంత్ నీల్.

Prashant Neel narrated the story of Salar.

Salaar Story Reviled: సలార్  స్టోరీ చెప్పేసిన ప్రశాంత్ నీల్.

కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్, ఇప్పుడు ఈ దర్శకుడితో సినిమా చేసేందుకు అటు టాలీవుడ్ తోపాటు ఇటు బాలీవుడ్ లోని స్టార్ హీరోలు సైతం రెడీ గా ఉన్నారు కాల్ షీట్లు ఇవ్వడానికి.

ప్రస్తుతానికైతే ఈ క్రేజీ డైరెక్టర్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సాలార్ అనే సినిమాను రూపొందించాడు. ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఈ సినిమాలో శృతిహాసన్ తొలిసారిగా ప్రభాస్ కి జోడీ కడుతోంది, ఇద్దరు లెజండరీ హీరోల వారసులు ఇప్పుడు తెరపంచుకోవడం పట్ల వారి ఫాన్స్ కూడా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిర్గందురు ఈ సినిమాను నిర్మించారు. రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు. అయితే ఈ సినిమాపై మార్కెట్లో రకరకాల వార్తలు వైరల్ అవుతుహున్నాయి.

సాలార్ సీజ్ ఫైర్ పేరుతో వస్తున్న ఈ సినిమాకు కెజిఎఫ్ కు కనెక్షన్ ఉందని టాక్ నడుస్తోంది, సాలార్ ఆ సినిమాకి కొనస్సాగింపే అని కూడా రూమర్లు లేకపోలేదు.

అందుకే ఈ సినిమా పై దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పందించాడు. సాలార్ సీజ్ ఫైర్ మీద వస్తున్నా పుకార్లకు పుల్స్టాప్ పెట్టాలని అనుకున్నాడో ఏమో కానీ, సాలార్ స్టోరీ లైన్ చెప్పేశాడు.

ఈ సినిమా స్టోరీ కి కెజిఎఫ్ కి అస్సలు సంబంధం లేదని అన్నాడు, పైగా కెజిఎఫ్ కి సాలార్ కొనసాగింపు కాదని అన్నాడు. మరీ ముఖ్యమైన విషం ఏమిటంటే ఈ సినిమా కథను కెజిఎఫ్ కన్నా ముందే రాసుకున్నాడట.

ఇక సాలార్ సినిమా కదా విషయానికి వస్తే ఇది ఇద్దరు స్నేహితుల కథ అని, ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో ఉంటుందని వెల్లడించాడు.

ఈ సినిమాలో ఇద్దరు విలన్లు ఉండగా ఒక విలన్ గా జగపతిబాబు, ఇంకో విలన్ గా మళయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ నటించారు.

Add a heading 2023 12 01T110330.175 Salaar Story Reviled: సలార్  స్టోరీ చెప్పేసిన ప్రశాంత్ నీల్.

ఈ సినిమా కథ చాలా కీలకమైందని ఎక్కడ కూడా తగ్గించడానికి వీలు లేకపోవడంతో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నామని అన్నాడు.

అయితే రెండవ భాగం షూటింగ్ ఇంకా మొదలు కాలేదని పేర్కొన్నాడు. హీరో ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు.

దానిని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాలో విలన్ గా మళయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ ను ఎంచుకున్నారు. ఇక కన్నడ విషయానికి వస్తే ఎలాగూ ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గా ఉండనే ఉన్నాడు.

తమిళ్ లో అయితే బాహుబలిగా ప్రభాస్ మంచి కలక్షన్స్ రాబట్టాడు. తెలుగు ప్రేక్షకులు డార్లింగ్ ను ఏ రేంజ్ లో అభిమానిస్తారో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దానికి తోడు జగపతి బాబు కూడా కనిపిస్తాడు.

Leave a Comment