బోర్డు చాక్ పీస్ లతో నకిలీ మందుల తయారి – ప్రాణాలు గోవింద !

l intro 1613404654 బోర్డు చాక్ పీస్ లతో నకిలీ మందుల తయారి - ప్రాణాలు గోవింద !

Preparation of fake medicines with board chalk pieces – Anaran Govinda! : ఈరోజుల్లో ఎక్కడో అక్కడ దాంట్లో కల్తి జరిగింది దీంట్లో కల్తి జరిగింది అంది అంటూ నిత్యం మనం వార్తలు చూస్తూనే ఉంటాం. అన్నింటి లో కల్తి చేసాక ఇప్పుడు వాళ్లకి బోర్ కొట్టినట్లు ఉంది. అందుకని ఈ సారి నకిలీ మందులు తయారి మీద పడింది వారి కన్ను.

చాక్ పీస్ పౌడర్ ని గంజి పౌడర్ ని ఉపయోగించి మందులు తయారు చేసే ముఠా ని పట్టుకున్నారు పోలీసులు. ఈ నకిలీ టాబ్లెట్స్ కి మేడిసిన్ జీరో అని పేరు పెట్టి మందుల షాప్ లకు సప్లయ్ చేసి భారీ గా సొమ్ము చేసుకున్నారు. దీనికి ఒక ఫార్మ కంపెనీ పేరు కుడా పెట్టారు అది ఎంటంటే మెగ్ లైఫ్ సైన్సెస్ అని. ఈ కంపెనీ మీద నకిలీ టాబ్లెట్స్ తయారు చేస్తున్నారు.

అలాగే వీరు తయారు చేసే పేర్లు, పాకింగ్ లాంటి వాటిల్లో ఎక్కడా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. చూడడానికి అచ్చం మందులు లాగే కనిపించేలా తయారుచేసారు. ఫస్ట్ ఈ కంపెనీ పేరు చూస్తే ఎవ్వరికి అనుమానం రాకుండా పెట్టారు. ఇప్పటికే 33 లక్షలు విలువైన మందులు DCA సీజ్ చెయ్యడం జరిగింది.

మందులు కొనేటప్పుడు ముందుగా మెగ్ లైఫ్ సైన్సెస్ అనే పేరు ఉందేమో చెక్ చేసుకోవాలని వారు చెప్పారు. ఇప్పటికే ఈ మందులు వైరల్ ఫీవర్లు, బాడీ పెయిన్స్ కు మంచి యాంటి బయాటిక్స్ అనుకుని డాక్టర్ లు రోగులకు రాయడం కూడా జరిగిందిద అని తెలుస్తోంది.

ఈ మందులు వాడితే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఈ నకిలి మందులు తయారు చేసే వాళ్ళను పట్టుకున్నామని వాళ్ళ దాగ్గర నుండి మరింత సమాచారం రాబడతాం అని DCA అధికారులు చెప్పారు

Leave a Comment