త్వరలో యూట్యూబ్ కి పోటీగా ఎలన్ మస్క్ X టీవీ యాప్ కి సన్నాహాలు

website 6tvnews template 2024 03 11T123601.643 త్వరలో యూట్యూబ్ కి పోటీగా ఎలన్ మస్క్ X టీవీ యాప్ కి సన్నాహాలు

ప్రపంచ కుబేరుడు, బిలియనీర్ ఎలన్ మస్క్ సోషల్ నెట్‌వర్క్ X లో వచ్చే వారం కొత్త టీవీ యాప్ ప్రారంభించడానికి సన్నాహాలు మొదలు పెట్టింది. దీనికోసం ప్రత్యేకించి అమెజాన్, శాంసంగ్ కస్టమర్ ల కోసం ఈ కొత్త టీవీ యాప్‌ను లాంచ్ చేయాలని ఎలన్ మస్క్ టీం ఆలోచిస్తోంది. దీనిలో మెసేజింగ్ నుంచి పీర్-టు-పీర్ పేమెంట్ల వరకు అన్ని సర్వీసులను అందించే సూపర్ యాప్‌గా తయారు చెయ్యాలని అనుకుంటున్నట్లు ఎలన్ మస్క్ కూడా పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితమే కొంతమంది యూజర్ల కోసం వీడియో, ఆడియో కాలింగ్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలోనే ప్లాట్‌ఫారమ్ వీడియోలను లాంగ్-ఫారమ్ వీడియోలను మనం నేరుగా స్మార్ట్ టీవీలలో త్వరలో చూడడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు మస్క్ పేర్కొన్నారు. ఇంతకుముందు ఈ యాప్ ని గూగుల్ యూట్యూబ్ అందించే టీవీ యాప్‌ను పోలినట్లుగా ఉంటుందని తెలిపింది. మస్క్ చెప్తున్నట్లు తాను యూట్యూబ్‌ తో పోటీ పడేందుకే ఈ కొత్త యాప్ తీసుకొస్తున్నాని X ప్లాట్ ఫారం వేదికగా ‘కమింగ్ సూన్’ అంటూ మస్క్ ట్వీట్ చేసాడు. కొత్త టీవీ యాప్‌కు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే అన్ని తెలుస్తాయని X వేదికగా ఆయన ట్వీట్ చేసారు.

ప్రస్తుత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ గత సంవత్సరం నుండి స్మార్ట్ టీవీల కోసం స్పెషల్ యాప్‌పై పని చేస్తోందని ఆయన అన్నారు. దీనికి సంబందించి అప్పటికే, మస్క్ 97 నిమిషాల వీడియోపై యూజర్లు చేసిన కామెంట్లకు ఆయన ఓపికగా రిప్లయ్ ఇచ్చారు. ఎవ్రీథింగ్ యాప్ పనిలో ఉందని ఆయన తెలిపారు. మీ ఫోన్ లో ఉన్న వీడియో లను మీ టీవీలో ప్లే చేయడానికి ఆపిల్ ఎయిర్ ప్లే కుడా వాడవచ్చు అని ఆయన అన్నారు.

మీ (Xbox) లేదా (Android TV)లో X కి సంబందించిన వెబ్‌సైట్‌ను కూడా ఓపెన్ చేయొచ్చు. అంతే కాకుండా పెద్ద స్క్రీన్‌పై లైవ్ షోలను కూడా చూడవచ్చని ఆయన చెప్పారు.ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ మాత్రమే కాకుండా, లైవ్-స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన ట్విచ్, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ అయిన సిగ్నల్, సోషల్ మీడియా ఫోరమ్ లో రెడిట్ వంటి అనేక ఇతర పాపులర్ యాప్‌లకు మస్క్ నుండి తీవ్ర పోటీని ఇస్తున్నట్లు కనిపిస్తోందని టేక్ నిపుణులు చెప్తున్నారు.

Leave a Comment