President Murmu visited Hyderabad: హైదరాబాద్ ను సందర్శించిన రాష్ట్రపతి ముర్ము.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లిలోని చేనేత కార్మికులను కలిసేందుకు భూదాన్ పోచంపల్లిని సందర్శించారు. చేనేత కార్మికులను కలిసిన తర్వాత ఆమెకి ఎంతో సంతృప్తి కలిగిందని అన్నారు.
ఈ పోచంపల్లి పర్యటనలో భాగంగా ఆమె చేనేత మగ్గాలను, టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని గమనించారు. ఆ తర్వాత సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది మూర్ము
మాట్లాడుతూ చేనేత రంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.ఆమె శీతాకాలం విడిదిలో భాగంగా హైదరాబాద్ సందర్శించారు. ఆమె వెళ్ళిన ప్రదేశాలివే
Acharya Vinobha Bhave Bhavan:
బేగంపేట విమానాశ్రయంలో దిగిన రాష్ట్రపతి ముందుగా వినోభా భావే భవన్ ని సందర్శించారు.
అక్కడ ఆమె భూధాన ఉద్యమకారులైన వినోభా భావే, వేదిరె రామచంద్ర రెడ్డి చిత్ర పాటలకు నివాళులు అర్పించారు.
ఆ తరువాత వినోభా భావే భవనం లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబీషన్ ని సందర్శించి అక్కడ పోచంపల్లి టై అండ్ డై, ఇక్కఠ చీరలను పరిశీలించారు.
వినోభా భావే భవన్ లోని స్టాల్స్:
- పోచంపల్లి ఇక్కత్
- పుట్టపాక తెలియ రుమాళ్ళు
- ముచ్చపేట చీరలు
- నారాయణపేట చీరలు
- గద్వాల చీరలు
- సిద్దిపేట గొల్లభామ చీరలు
- చేనేత స్టాల్లు
వీటన్నింటిని రాష్ట్రపతి ముర్ము గమనించి, వారి సమస్యల గురించి పరిశీలించి వారికి వారి అభ్యర్థనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
చేనేత వృత్తహులను కపడుకోవాలని, అవి వృత్తులు మాత్రమే కాదు కళలు అని అన్నారు.