కాన్సెర్ నివారణ కు అశ్వగంధ తో చెక్ పెట్టచ్చు – టాటా మెమోరియల్ సెంటర్ : Prevent Cancer with Ashwagandha-Tata Memorial Centre.

website 6tvnews template 26 కాన్సెర్ నివారణ కు అశ్వగంధ తో చెక్ పెట్టచ్చు - టాటా మెమోరియల్ సెంటర్ : Prevent Cancer with Ashwagandha-Tata Memorial Centre.

Prevent Cancer with Ashwagandha Tata Memorial Centre : క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి అని మనందరికీ తెలిసినియా విషయమే . అయితే దీన్ని మొదటి దశలో గుర్తించి చికిత్సను ప్రారంభించకపోతే, ఆలస్యం చెయ్యడం వల్ల చికిత్సలో మెరుగైన ఫలితాన్ని పొందడం కష్టం.

ఇప్పుడు:

అల్లోపతిలో క్యాన్సర్ వ్యాధికి శస్త్రచికిత్స, కీమోథెరపీ మరియు రేడియేషన్ విధానాన్ని ఉపయోగించి చికిత్సను అందిస్తున్నారు . ఈ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి . అయితే ఈ రోజుల్లో చాలామంది ట్రీట్మెంట్ పరంగా ఆయుర్వేద సురక్షితమని భావిస్తున్నారు.

ముఖ్యంగా క్యాన్సర్ విషయంలో ప్రజలు ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల ఆయుర్వేద చికిత్సను ఎంచుకుంటున్నారు. దీనిని దృష్టి లో ఉంచుకుని టాటా మెమోరియల్ సెంటర్ 20 ఎకరాలలో దాదాపు 500 ఆయుర్వేద మొక్కలని పెంచుతోంది , అంతే కాకుండ పూర్తి ఆయుర్వేద వనమూలికలు తో ట్రీట్మెంట్ చెయ్యడం కోసం అన్ని ఆధునిక సదుపాయాలతో ఒక రిసెర్చ్ సెంటర్ తో పారు 100 పడకల హాస్పిటల్ కూడా నిర్మించారు .

వారి రిసెర్చ్ లో అశ్వగంధ తో పాటు పసుపు మరి కొన్ని ఇతర వనములికలతో ట్రీట్మెంట్ చెయ్యడం వలన కాన్సెర్ కి చెక్ పెట్ట వచ్చని చెప్పారు , దీనికి సంబందించి ఫిబ్రవరి 2018 నుండి రిసెర్చ్ చేస్తున్నామని డాక్టర్ విక్రం గోటా చెప్పడం జరిగింది , దీనికి
సంబంధించి సాంప్రదాయ పద్దతులలో మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని ఆయన తెలిపారు .

ఆయన పరిశోనలలో ఆయుర్వేదను ఉపయోగించడానికి కొన్ని కారణాలు చెప్పారు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ వ్యాధిని రూట్స్ నుంచి అంటే మూలాల నుండి వేరు చేయడం, ట్రీట్మెంట్ తీసుకునే సమయం లో భాద కాని నొప్పి కాని లేకుండడం , అలాగే శరీరం లో ఉండే రోగనిరోధక శక్తీ ని పెంచడం వంటి వారికి ఆయుర్వేద బాగా పనిచేస్తుంది అని చెప్పారు .

ఆయుర్వేద చికిత్స ద్వార క్యాన్సర్ తో బాధపడేవారి శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ మరియు టాక్సిన్‌లను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది వివిధ అవయవాల పనితీరును బలపరుస్తుంది. మరియు పునరుద్ధరిస్తుంది.

ఆయుర్వేద మందులు రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. కాన్సెర్ నివారణలో ముఖ్యం గా అస్వఘంద తో పాటు పసుపు బాగా పనిచేస్తుంది , వీటి తో పారు పలు రకాల ఆయుర్వేద వనమూలికలు ఎలా పనిచేస్తాయో చెప్పడం జరిగింది

అశ్వగంధ – యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షనాలు కలిగినది:

ashwagandha merlion కాన్సెర్ నివారణ కు అశ్వగంధ తో చెక్ పెట్టచ్చు - టాటా మెమోరియల్ సెంటర్ : Prevent Cancer with Ashwagandha-Tata Memorial Centre.

క్యాన్సర్ బాధితులు ఒత్తిడితో కూడిన జీవితాన్ని జీవిస్తుంటారు. ఎందుకంటే వారి అనారోగ్యం దృష్ట్యా వారు ఎదుర్కునే సమస్యలు మరియు క్యాన్సర్ తిరిగి వస్తుందనే భావన వల్ల ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారికి అశ్వగంధ మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

అశ్వగంధ ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడానికి సహాయపడుతుందా అనే విషయాన్నితెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు పరీక్షలు చేసారు, ఒత్తిడి, ఆత్రుత, బలహీనత లేదా క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులను అశ్వగంధ ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేశారు.

ఇందులో 50 % కాన్సెర్ అదుపు లో ఉంచవచ్చని తెలిసిందని అయన తెలిపారు

పసుపు :

VWH Illustration 10 Healing Herbs With Medicinal Benefits Illustrator Mira Norian Title Final 47ce13013375448c9e8e7e8c21fb50f7 కాన్సెర్ నివారణ కు అశ్వగంధ తో చెక్ పెట్టచ్చు - టాటా మెమోరియల్ సెంటర్ : Prevent Cancer with Ashwagandha-Tata Memorial Centre.

భారతదేశంలో, పసుపు చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. మరియు ఇది క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా క్యాన్సర్ చికిత్సకు కూడా ఉపయోగించబడుతుంది. పసుపు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. ల్యాబ్‌లలో జరిపిన పరీక్షలలో పసుపు క్యాన్సర్ కణాలను వృద్ధిని నెమ్మది చేయగలదని మరియు వాటిని నాశనం చేయడంలో కూడా సహాయపడుతుందని తేలింది.

గిలోయ్ లేదా గుడూచి:

గిలోయ్ అనేది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడానికి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే ఒక మొక్క.

గిలోయ్ అనే మొక్క క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అలాగే మన శరీరంలోని క్యాన్సర్ కణాలను చనిపోయేలా చేస్తుంది. మరియు కణితులను పెరగకుండా చేస్తుంది ముఖ్యంగా క్యాన్సర్ వ్యాప్తి చెందే అవకాశాలను తగ్గిస్తుంది.

కాకపోతే వారు ఇప్పటికీ గిలోయ్ యొక్కను ఎంతకాలం ఉపయోగించాలనే విషయంపై మరింత పరిశోధన చేస్తున్నారు.

రాచ వేము:

రాచ వేము అనేది మన శరీరానికి నిజంగా మేలు చేసే ఒక ప్రత్యేక మొక్క. క్యాన్సర్ కణాలను నాశనం చేయడం ద్వారా క్యాన్సర్‌తో పోరాడటానికి ఇది సహాయపడుతుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది మరియు క్యాన్సర్‌కు కారకాల నుండి కాపాడుతుంది.

ఈ రాచ వేము తీసుకోవడం ద్వారా, వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. ఆయుర్వేద క్యాన్సర్ చికిత్సలో, రాచ వేము అనేది వివిధ ప్రయోజనాల కోసం అశ్వగంధ, పసుపు మరియు గుగ్గులు వంటి ఇతర మొక్కలతో కలిపి తరచుగా ఉపయోగించే ఒక మొక్క. రాచ వేము మాత్రలు, పొడులు లేదా డికాషన్ వంటి రూపాల్లో వివిధ మార్గాల్లో ఉపయోగిస్తుంటారు.

అంతే కాకుండా ఇంకా కొన్ని Shatavari, Brahmi, Katha,Kalmegh, Pushkarmula, Bhumi Amla వంటి వనమూలికలు కూడా కనుగొన్నామని వాటి మీద కూడా విస్తృతం గా పరిశోదనలు జరుగుతున్నాయని దీని కోసం 300 కోట్లు కేటాయించామని
డాక్టర్ విక్రం గోటా తెలిపారు

Leave a Comment