Prithviraj Sukumaran: నాగార్జున రికార్డ్ బ్రేక్..? పృథ్వీ రెచ్చిపోయాడా?

website 6tvnews template 2024 03 21T172014.567 Prithviraj Sukumaran: నాగార్జున రికార్డ్ బ్రేక్..? పృథ్వీ రెచ్చిపోయాడా?

సలార్ (Salaar) సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు మల్లు స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Pruthviraj Sukumaran). డార్లింగ్ ప్రభాస్ (Prabhas)ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ఫ్యాన్ పవర్ పెంచుకుంటున్న పృథ్వీరాజ్ ఇప్పుడు మరో అద్భుతమైన పాత్రలో వెండితెరమీద అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. లేటెస్టుగా పృథ్వీరాజ్ హీరోగా నటించిన ఆడు జీవితం..ది గోట్ లైఫ్ (Goat Life)అనే మూవీ త్వరలో విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లతో సినిమాపై మేకర్స్ అంచనాలను పెంచేస్తున్నారు. లేటెస్టుగా ఈ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈసారి ఈ సినిమాతో పృథ్వీ టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Nagarjuna)రికార్డును బ్రేక్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇంతకి ఆ రికార్డు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

WhatsApp Image 2024 03 21 at 5.08.46 PM Prithviraj Sukumaran: నాగార్జున రికార్డ్ బ్రేక్..? పృథ్వీ రెచ్చిపోయాడా?

గోట్ లైఫ్ ఓ సర్వైవల్ థ్రిల్లర్ :

బెన్యామిన్ (Benyamin)రాసిన గోట్ డేస్ (Goat Days) నవల ఆధారంగా మలయాళంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ (Blessy)గోట్‌లైఫ్ (Goat Life) సినిమాకు దర్శకత్వం వహించాడు. 2గంటల41 నిమిషాల డ్యూరేషన్ తో ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు మేకర్స్ . వాస్తవానికి 2గంటల52 నిమిషాల నిడివితో ముందుగా మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే కొన్ని సీన్స్ కు సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలిపింది. దీంతో దాదాపు 11 నిమిషాలు పైనే సినిమాను ట్రిమ్‌ చేసి రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది.

నాగార్జున రికార్డు బ్రేక్ చేస్తాడా? :

ఈ సినిమాలో పృథ్వీరాజ్‌సుకుమారన్‌ (prithviraj sukumaran)కు జోడీగా అమలాపాల్ (amala Paul)నటిస్తోంది. వీరిద్దరి మధ్య ఓ ఘాటైన లిప్‌లాక్ సీన్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అది కూడా 5 నిమిషాల కంటే ఎక్కువే ఉంటుందని సమాచారం. మాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఈ రేంజ్ లో లిప్ లాక్ ఇప్పటి వరకు ఏ సినిమాలో లేదని తెలుస్తోంది. ఇప్పుడు రిలీజయ్యే చాలా వరకు సినిమాల్లో లిప్ లాక్ సీన్ లు కామన్ అయ్యాయి. కానీ అప్పట్లో ముద్దు పేరు చెబితే టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Nagarjuna)నే గుర్తుకు వస్తాడు. గీతాంజలి (Geethanjali)సినిమాలో నాగార్జున , గిరిజను కు ఎలాంటి విరామం లేకుండా రెండున్నర నిమిషాల పాటు లిప్ లాక్ కిస్ పెట్టాడు. ఓం నమః అనే వచ్చే పాట మొత్తం వీరి లిప్ లాక్ సీనే ఉంటుంది. ఇప్పటివరకు టాలీవుడ్ లో అదే బ్రేక్ ఈవెన్ లిప్ లాక్. కానీ ఇప్పుడు ది గోట్ లైఫ్ లో హీరో పృథ్వీరాజ్.. ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తాడని టాక్ వినిపిస్తోంది.

Leave a Comment