priyaprakash varrier: దేవకన్యలా ప్రత్యక్షమైన కన్నుగీటు భామ.

priyaprakash varrier

priya prakash varrier: దేవకన్యలా ప్రత్యక్షమైన కన్నుగీటు భామ.

కేరళ కుట్టీ , క్రేజీ బ్యూటీ priya prakash varrier దేవ కన్య లుక్‎లో ప్రత్యక్షమైంది. ఈ బ్యూటీ ఏంజెల్‌గా సముద్రపు ఒడ్డున దిగిన ఫోటోలు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.

తెల్లటి డ్రెస్సులో నాభి అందాలను ప్రదర్శిస్తూ ప్రియా కుర్రాళ్ల హృదయాలను దోచేస్తోంది. ఒకే ఒక్క కన్ను గీటు వీడియోతో రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యింది priya prakash varrier.బోలెడంత అందం ఉన్నా..

పాపం అదృష్టం మాత్రం దరి చేరడం లేదు. ఎందుకో సినీ కెరీర్‎లో సరైస సక్సె అందుకోలేకపోతోంది ఈ భామ. ఇండస్ట్రీలో సరైన అవకాశాలు లేకపోవడంతో ఫిల్మ్ మేకర్స్‎ని ఆకర్షించే పనిలో పడినట్లుంది .

అందుకే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో మంటలు రేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ అవుట్‌ ఫిట్‌లో దేవకన్యలా ప్రత్యక్షమయ్యింది. ఆకాశం నుంచి నేరుగా భూమి మీదకు వచ్చిన జాబిల్లిలా అందరి మదిని దోచింది.

ఇక ఈ పిక్స్ చూసిన ఫాలోవర్స్ ఆమె వయ్యారాలకు ఫిదా అయ్యారు. స్వర్గం నుంచి దేవకన్య దిగొచ్చిందా అంటూ కాంప్లిమెంట్స్‎తో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు.

మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ ఒరు అదార్ లవ్ అనే మలయాళం మూవీతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యింది. ఈ సినిమా ప్రియాకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

నిజానికి ఈ సినిమాలో ప్రియా క్యారెక్టర్ చిన్నదే. కానీ ఈ మూవీలోని ప్రియా ఒక సీన్ లో స్టైలిష్‎గా కన్నుకొడుతుంది. ఆ వీడియో సినిమా యూనిట్ ప్రమోషన్ వీడియోగా ఉపయోగించుకోవడంతో అమ్మడు ఓవర్ నైట్‎లో ఇండియా వైడ్‎గా పాపులారిటీని సంపాదించుకుంది.

ఈ అమ్మడి కన్ను గీటే స్టైల్ కి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫిదా అయ్యాడంటే అమ్మికి ఏ లెవెల్‎లో క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క సినిమాతో ప్రియాకు ఆఫర్లు వెల్లువలా వచ్చిపడ్డాయి.

వరుస సినిమాలతో బిజీ హీరోయిన్‎గా మారిపోయింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటించింది.

priya prakash varrier 28 అక్టోబర్ 1999న జన్మించింది. ఆమె తండ్రి సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ లో ఓ ఎంప్లాయ్. ప్రియా Keralaలోని త్రిస్సూర్‌లో సాందీపని విద్యా నికేతన్‌లో స్కూలింగ్ చేసింది.

Thrissur లోని విమలా కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చేసింది. ప్రియా ఓ క్లాసికల్ డాన్సర్. వెండితెరపై ఓ వెలుగు వెలగాలనే ఆశతోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. అందం అందుకు తగ్గ నటన నైపుణ్యం ఉన్నా..

సిల్వర్ స్క్రీన్ మాత్రం ఈ ముద్దుగుమ్మకు కలిసిరావడం లేదు. 2018లో ‘శ్రీదేవీ బంగ్లా’అనే సినిమా చేసినా అది కాస్త కోర్టు కేసుల్లో చిక్కుకుని విడుదల కాలేదు. ఆ తర్వాత 2019లో ఒరు ఆదార్ లవ్‌తో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

కానీ ఈ మూవీ wink girlగా మాత్రం ప్రియాకు గుర్తింపు తీసుకువచ్చింది. అనంతరం నటించిన సినిమాలు కూడా అమ్మడికి లక్ తీసుకురాలేకపోయాయి.

ఈ క్రమంలో ఈ భామ అవకాశాల కోసం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోందని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను ఇన్‎స్టాగ్రామ్‏లో అప్‎లోడ్ చేస్తూ ఫాలోవర్స్ ను అలరిస్తోంది. ప్రస్తుతం అమ్మడికి సోషల్ మీడియాలో 7.6 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

priya prakash varrier చాలా రోజుల తర్వాత రీసెంట్ గా తెలుగులో pawan kalyan నటించిన బ్రో సినిమాలో కనిపించింది. ఈ మూవీలో sai dharam tej కి చెల్లెలి క్యారెక్టర్ లో నటించింది.

అయితే బ్రో బాక్పాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో అమ్మడు మళ్లీ ఢీలా పడిపోయింది. అయినా ఈ చిన్నది సోషల్ మీడియాను వదలడం లేదు.

నెటిజన్స్ ఆమెను ఎంత ట్రోల్ చేసినా అవేమి పట్టించుకోకుండా.. అందాలను కెమెరా ముందు ప్రదర్శిస్తూ హాయిగా గ్లామర్ షో చేస్తుంది.

ఇక సౌత్ ఇండస్ట్రీలో వర్కౌట్ కాదనుకుంది కాబోలు ప్రస్తుతం ప్రియా ప్రకాష్ Bollywood చెక్కేసింది. ఈ అమ్మడు ఓ రెండు హిందీ చిత్రాలతో పాటు ఓ మలయాళం మూవీలో నటిస్తున్నట్లు సమాచారం.

Leave a Comment