Pro Kabaddi League: సీజన్ 10, 12వ మ్యాచ్ లో KC బెంగళూరు బుల్స్ పై దబాంగ్ ఢిల్లీ ఘన విజయం !
శ్రీ కంఠీరవ స్టేడియంలో ఈ శుక్రవారం జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో 10 లో 38-41 స్కోర్ తో దబాంగ్ ఢిల్లీ బెంగళూరు బుల్స్ ని ఓడించింది.
ఢిల్లీ కెప్టెన్ నవీన్ కుమార్ 13 పాయింట్లతో అగ్ర స్థానాల్లో నిలవగా, ఆషూ మాలిక్ 9 పాయింట్లు సాధించాడు.
ఒక్కో నిముషం ఒక్కోలాగా ఆట సాగుతూ వచ్చింది. ఐదవ నిముషంలో 3-3 పాయింట్లతో బుల్స్, దబాంగ్ ఢిల్లీ KC నెక్ టూ నెక్ పోరుతో ఆడాయి.
ఇక 8వ నిముషంలో ఢిల్లీ వికాస్ కండోలాను గట్టి పోటీతో ఎదుర్కొని 6-3 స్కోర్ చేసింది. ఢిల్లీ ఫ్రాంఛైజి తమ లీడ్ ని మరింత పెంచుకోవడంతో రైడర్ ఆషు మాలిక్ తన ఆటను కూడా మరింత ఉత్తేజితం చేసుకున్నాడు.
దబాంగ్ ఢిల్లీ వారి ప్రత్యర్థిపైన తీవ్ర ఒత్తిడి చేసి చివరి 12వ నిముషంలో ఆల్ అవుట్ చేసింది. ఇక ఆ తర్వాత 15వ నిముషంలో 14-7 స్కోర్ చేసి దబాంగ్ ఢిల్లీ భారీ ఆధిక్యాన్ని సాధించింది.
18వ నిముషంలో బెంగళూరు బుల్స్ సూపర్ ట్యాకిల్ ని ఆపేసింది. ఇలా మొదటి సగం సమయం పూర్తయ్యే సమయానికి 17-11 స్కోర్ తో ఢిల్లీ జట్టు ఆధిక్యంలో ఉంది.
ఇక మరో సెకండ్ ఆఫ్ లో ప్రారంభంలోనే నవీన్ ను సౌరబ్ నందల్ ఓడించాడు. ఇక బుల్స్ 17-20 స్కోర్స్ తో మూడు పాయింట్ల తేడా ఇరు పక్షాల మధ్య ఉంది. 26వ నిముషంలో 23-20 స్కోర్స్ తో ఢిల్లీ జట్టు మల్లి ముందంజలోకి వచ్చేసింది.
ఆ టాప్ అట 31 నిముషంలో 29-23 స్కోర్స్ తో మంచి ఆధిక్యంతో ఆల్ అవుట్ తీసుకున్నారు.ఇక 33వ నిముషంలో 32-29 స్కోరుతో మంచి లీడ్ లో ఉంది.
దబాంగ్ ఢిల్లీ KC 38వ నిముషంలో 36-20 స్కోర్స్ తో ముందంజలోకి వెళ్ళింది. ఇక అప్పుడే నవీన్ రైడ్ ని ప్రారంభించాడు. ఇక దబాంగ్ ఢిల్లీ KC సమగ్ర విజయాన్ని సాధించింది.