Pro Kabaddi – Who will be the champion this time | ప్రో కబడ్డీ పై ఉత్కంఠ – ఈ సారి ఛాంపియన్ అయ్యేది ఎవరో
కబడ్డీ ఇది పక్కా పల్లెటూరి ఆట, గ్రామాల్లో యువత సరదా కోసం ఆదుకునే ఆట, భారత దేశ వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం ఉన్న ఆట. అయితే ఈ ఆటకు ప్రో కబడ్డీ లీగ్ లతో మరింత గుర్తింపు దక్కిందని చెప్పాలి. క్రికెట్ మాదిరిగా ఈ ఆట ను లైవ్ టెలికాస్ట్ ఇస్తూ యమా క్రేజ్ తీసుకొచ్చారు.
ఈ మ్యాచ్ చూసేందుకు యువత కూడా భలేగా ఉత్సాహం చూపించారు. వివిధ రాష్ట్రాల జట్లు బరిలోకి దిగి నువ్వా నేనా అన్నట్టు తలపడుతుంటే చూసే వారికి మహా మజా గా అనిపించేది.
కూతకి వచ్చిన ఆటగాణ్ణి ఒడిసి పట్టి పాయింట్లు పోగొట్టుకోకుండా ఉండాలని ఒక జట్టు చుస్తే, ఎలాగైనా అవతలి జట్టులో ఆటగాళ్లను ఔట్ చేసి రావాలని ఇవతలి జట్టు ఆటగాళ్లు ప్రయత్నిస్తూ ఉంటారు.
ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది తెలుసుకోవడానికి ఉత్కంఠభరితంగా సాగే ఈ మ్యాచ్ చూసేందుకు యువత టీవీలకు అతుక్కుపోయి చూస్తూ ఉంటారు. అందుకే మన దేశంలో ప్రో కబడ్డీ లీగ్ లకు అంతటి ప్రాముఖ్యత ఉంది.
ప్రస్తుతం ప్రోకబడ్డీ లీగ్ లు మన దేశంలోని పలు నగరాల్లో నిర్వహిస్తున్నారు. అహ్మదాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై, నోయిడా, ముంబై, జైపూర్, హైదరాబాద్, పాట్నా, ఢిల్లీ, కోల్‌కతాచ, పంచకులలో కబడ్డీ లీగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 2వ తేదీన మొదలైన ఈ ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ లు వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ కబడ్డీ మ్యాచ్లను రెండు సంవత్సరాల తరవాత మొట్టమొదటి సరిగా 12 నగరాల్లో నిర్వహిస్తున్నారు.
ఇక ఈ కబడ్డీ కి సంబంధించి పాయింట్లను ఎలా కేటాయిస్తారు అనే విషయం ఒక్కసారి చూద్దాం. ఇందులో గెలిచినా జట్టుకి మ్యాచ్ అనంతరం ఐదు పాయింట్లు దక్కుతాయి. ఓడిపోయినా జట్టుకి కూడా ఒక ఆఫర్ ఉంది. ఆటలో ఒదిన జట్టు యొక్క ఓటమి మార్జిన్ ను బట్టి ఆ పాయింట్లు ఇస్తారు. ఓటమి మార్జిన్ అనేది 7 లేదంటే అంతకన్నా తక్కువ ఉంటె ఒక పాయింట్ ఇస్తారు.
ఏడు కన్నా ఎక్కువ ఉంటె ఎటువంటి పాయింట్లు ఆ జట్టుకి దక్కవు. గెలిస్తే ఎన్ని పాయింట్లు వస్తాయో తెలుసు మరి మ్యాచ్ టై అయితే పాయింట్లు ఎలా కేటాయిస్తారు అని అనుమానం రావచ్చు. మ్యాచ్ టై అయినా పక్షంలో రెండు జట్లకు చేరేసి మూడు పాయింట్లు ఇస్తారు. ఇక పాయింట్ల పట్టికలో ప్రధమ స్థానాన్ని దక్కించుకున్న జట్టుకి ఒక బంపర్ ఆఫర్ ఉంటుంది. వారు నేరుగా ప్లే ఆఫ్స్ కి అర్హత సాధిస్తారు.
ఇప్పటివరకు చుస్తే పాట్నా జట్టు ప్రో కబడ్డీలో తమ సత్తా చాటుకుంది. పాట్నా పైరేట్స్ మూడుసార్లు ప్రో కబడ్డీ లీగ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆతరువాతి స్థానంలో జైపూర్ జట్టు నిలిచింది. జైపూర్ పింక్ పాంథర్స్ రెండు సార్లు ప్రో కబాడీ లీగ్ ట్రోఫీని దక్కించుకుంది.
యూ ముంబా, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, దబాంగ్ ఢిల్లీ కేసీ జట్లు తలా ఒక సారి ట్రోఫీని ముద్దాడాయి. మరి ఈఏడాది ఛాంపియన్ ట్రిఫీని తొడ కొట్టి సొంతం చ్చేసుకునే వీరులెవరో తెలియాలంటే వేచి చూడక తప్పదు.