మెగా ప్లాన్ లో ముఖేష్ అంబాని – A I సేవలు కోసం అమెరికన్ కంపెనీ తో ” హనుమాన్ ప్రాజెక్ట్ “

website 6tvnews template 75 మెగా ప్లాన్ లో ముఖేష్ అంబాని - A I సేవలు కోసం అమెరికన్ కంపెనీ తో " హనుమాన్ ప్రాజెక్ట్ "

మెగా ప్లాన్ లో ముఖేష్ అంబాని – A I సేవలు కోసం అమెరికన్ కంపెనీ తో ” హనుమాన్ ప్రాజెక్ట్ఆ : యిల్ తో పాటు టెలికాం, ఇతర వ్యాపారలన్నింటి సేక్సేస్ గా నడుపుతు లాభాల బాటలో వెళ్తున్న ముకేష్ అంబాని ఇప్పుడు తన చూపు A I ఉంది. A I అవసరాన్ని పసిగట్టిన రిలయన్సు సంస్ద తమ ఆలోచన ప్రకారం దీనికి సంబందించిన సమాచారం అందరి తామే మొదట అందించాలి అనే ఉద్దేశ్యం తో అమెరికాకు చెందిన అతి పెద్ద చిప్ సంస్ద అయిన Nvidia కంపెనీ తో కల్సి ఒక మెగా ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టామని అంబాని ఒక ప్రకటన లో తెలిపారు.

అయితే తాము కొన్నింటి మీద పరిశోధనలు చేసి అభివృద్ధి చెయ్యాలని అనుకుంటున్నామని ఆయన తెలిపారు. అందులో బాగంగా లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ళు అంటే కష్టతరమైన భాషా పద్ధతులు, నార్మల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ లు అనగా సహజం గా వాడే భాషా ఆచరణకు అవసరమైన పద్దతులు , ఇంకా భారీ పదాల సమూహం వంటి వాటిపై మొదట అవసరమైన శిక్షణ ఇస్తారు.

అంతే కాకుండా ప్రజలు అడిగే ఎటువంటి ప్రశ్నలకు అయిన సమాధానాలను వాటికి అవే అప్పటికప్పుడు జనరేట్ చేసే సామర్ధ్యం అంటే మనం అడిగిన ప్రశ్నలకు అప్పటికప్పుడు అవే సమాధానం చెప్పడం A I చేస్తుంది. అయితే ఇప్పటికే చాట్ జిపిటి మనకు అవసరమైన సేవలు అందిస్తున్నాయి. ముకేష్ అంబాని తల పెట్టిన ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉన్నాయని రిలయెన్స్ సంస్ద ఒక ప్రకటన విడుదల చేసింది.

download 2 మెగా ప్లాన్ లో ముఖేష్ అంబాని - A I సేవలు కోసం అమెరికన్ కంపెనీ తో " హనుమాన్ ప్రాజెక్ట్ "

మన దేశం లో పారిశ్రామిక అభివృద్ధికి మేము వేసిన మొదటి అడుగు లో Nvidia అనే సంస్ద తో ఒప్పందం చేసుకున్నట్లు రిలయెన్స్ సంస్ద తెలిపింది. ప్రపంచం లోనే అత్యధిక జనాభా కలిగిన భారత దేశం లో విభిన్న భాషలు మాట్లాడే వారికి A I అప్లికేషన్స్ కు అవసరమైన వాటికి అనుగుణంగా ఉండేలా అభివృద్ధి చేస్తామని Nvidia సంస్ద ప్రకటించింది.

ఇంతటి భారీ ప్రాజెక్ట్ కి కావలసిన, అవసరమైన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని తాము అందిస్తామని Nvidia సంస్ద ప్రకటించిది. తక్షణమే వైద్యులు అవసరం అందుబాటులో లేని సమయం లో కాని, వైద్యులు లేని ప్రదేశాలలో కాని ఈ A I సహాయంతో రోగి లక్షణాలు తో పాటు ఇమేజింగ్ స్కానింగ్ చెయ్యడానికి ఈ A I ఎంతో ఉపయోగపడుతుందని ఈ సంస్ద తెలిపింది

అంతే కాకుండా దశాబ్దాలకు చెందిన వాతావరణ శాఖ కు సంబందించిన డేటాను ఈ A I అవసరమైనంత వరకు విశ్లేషించి ఖచ్చిత మైన సమాచారం అంటే వాతావరణ వివరాలు, తుఫానులు కు సంబందించిన వివరాలు అంచనా వెయ్యగలదని వెల్లడైంది.

ఇంకా వీరి పరిశోధనలో భాగం గా Nvidia సంస్ద అత్యాధునికమైన NVIDIA®GH200 Grace Hopper Super Chip, NVIDIA DGXTM క్లౌడ్, ఈ క్లౌడ్ లోని A I సూపర్ కంప్యూటర్ సర్వీసెస్ కి అనుసంధానం కు అవసరమైన పరిజ్ఞానం అందిస్తోంది. అంతే కాకుండా ఈ A I టెక్నాలజీ ని రిలయెన్స్ సంస్ద లో ఒక బాగమైన టెలికాం రంగమైన జియో లో కుడా ఉపయోగించుకుని తాన వ్యాపార సామర్ధ్యం తో పాటు తన అవసరాలను పెంచుకోవడానికి తగిన ప్లాన్ కుడా చేస్తోంది. మన ప్రధాని మోడీ Nvidia సంస్ద ప్రతినుధులను కలిసిన కొద్ది రోజుల అనంతరం ఈ ప్రకటన విడుదల చేసారు.

Leave a Comment