‘అమరన్’ రిలీజ్ ను ఆపాలి..కమల్‌హాసన్‌కు వ్యతిరేకంగా నినాదాలు.

website 6tvnews template 79 'అమరన్' రిలీజ్ ను ఆపాలి..కమల్‌హాసన్‌కు వ్యతిరేకంగా నినాదాలు.

‘అమరన్’ రిలీజ్ ను ఆపాలి..కమల్‌హాసన్‌కు వ్యతిరేకంగా నినాదాలు : విలక్షణ నటుడు కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) వరుస హిట్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఓ వైపు ఉలగనాయగన్ (Ulaganayagan )యూనివర్సల్ హీరో గా వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే మరోవైపు మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ (Makkal Needhi Maiyam )
అధినేతగా రాజకీయాల్లోనూ కమల్ హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళనాడు ( Tamilnadu ) లో కమల్ హాసన్ హాట్ టాపిక్ గా మారారు. ఆయన నిర్మిస్తున్న మూవీ అమరన్ (Amaran ) రిలీజ్ కి ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ తమిళనాడులో తమిళగ మక్కల్ జననాయక కట్చి (TMJK ) సభ్యులు నిరసన చేపట్టారు.

Amaran should not be Released : అమరన్ విడుదలను ఆపాలి :

కమల్ హాసన్ (Kamal Haasan ) నిర్మిస్తున్న ‘అమరన్’ (Amaran ) చిత్రం విడుదలకు ముందే చిక్కుల్లో పడింది. ఈ సినిమా రిలీజ్ ను ఆపాలంటూ తమిళనాడులో తమిళగ మక్కల్ జననాయక కట్చి (TMJK ) ఆందోళన చేపట్టింది. రీసెంట్ గా రిలీజైన టీజర్ లో ముస్లింలను కించపరిచే విధంగా అభ్యంతరకరంగా చూపించారని సంస్థ సభ్యులు ఫైర్ అయ్యారు . అమరన్ రిలీజ్ అవ్వకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత స్ఫూర్తితో తీసిన ఈ సినిమా:

సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ( Sony Pictures International Productions ) , కమల్ హాసన్ (Kamal Haasan ) , ఆర్ మహేంద్రన్ (R Mahendran ) సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘అమరన్’ (Amaran )ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) డైరెక్ట్ చేస్తున్నారు.

మేజర్ ముకుంద్ వరదరాజన్ (Major Mukund Varadarajan) నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు . రాహుల్ సింగ్ (Rahul Singh ), శివ్ అరూర్ (Siva Arur )రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ సిరీస్‌ ( India’s Most Fearless series) లోని ఒక అధ్యాయనాన్ని తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. శివకార్తికేయన్ (Sivakarthikeyan) , సాయిపల్లవి (Sai Pallavi)


హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. కశ్మీర్‌ (Kashmir )లోని షాపియన్ (Shapian) బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ షూట్ జరుగుతోంది. ఉగ్రవాదులు దేశాన్ని నాశనం చేయడం.. వారి నుంచి భారత్ ను కాపాడేందుకు ఆర్మీ ఏం చేసింది అన్నదే ఈ మూవీ.

What’s in Amaran Teaser? : అమరన్ టీజర్‌లో ఏముంది?

అమరన్ (Amaran) లో శివకార్తికేయన్ అశోక్ చక్ర గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ (Major Mukund Varadarajan) క్యారెక్టర్ చేస్తున్నాడు. మేజర్ వరదరాజన్ 2014లో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఆయన పాత్రలోనే శివకార్తికేయన్ ఆమరన్ లో కనిపించునున్నాడు. కార్తికేయన్ బర్త్ డే సందర్భంగా మూవీ యూనిట్ టీజర్ రిలీజ్ చేసింది.

ఈ టీజర్ లో భారతీయ సైనికుడిని ముస్లింలు కిడ్నాప్ చేసి భయపెట్టే సన్నివేశాలు ఉన్నాయి. దీంతో ముస్లింలను టెర్రరిస్టులుగా మూవీ లో చూపిస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ టీఎంజేకే (MJK) సభ్యులు సినిమాకు, కమల్ కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. అంతేకాదు ‘అమరన్’పై బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. కమల్ హాసన్ దిష్టిబొమ్మను కాల్చి తమ నీరసనను వ్యక్తం చేశారు.

Leave a Comment