ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. బన్నీ నటించిన పాన్ ఇండియా మూవీ సుకుమార్ (Sukumar) ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, పుష్ప2 (Pushpa2) ది రూల్ ఆగస్టు 15న విడుదల కానుంది. సరిగ్గా ఇవాళ్టి నుంచి ‘పుష్ప 2’ తెరపైకి రావడానికి 150 రోజులు సమయం ఉంది.
పాన్-ఇండియా రీచ్ కోసమే నేషనల్ హాలిడేను ఉపయోగించుకోవడానికి మేకర్స్ స్వాతంత్ర్య దినోత్సవం నాడు సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. లేటెస్ట్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. తన మాస్ ఎంట్రీతో ఫ్యాన్స్ ను అబ్బురపరచడానికి బన్నీ రెడీ అవుతున్నాడు. ముందు నుంచి మేకర్స్ పుష్ప2 ను ఆగష్టు 15న విడుదల చేస్తామని చెప్పినప్పటికీ దర్శకుడు సుకుమార్ పర్ఫెక్షన్ వల్ల ఆలస్యం అవుతుందని అభిమానులు ఆందోళన చెందారు. అయితే తాజా అప్డేట్ తో సుకుమార్ , బన్నీ ఇద్దరూ షెడ్యూల్‌కు కట్టుబడి ఉన్నారని తెలుస్తోంది.
కౌంట్ డౌన్ స్టార్ట్ :
పుష్ప 2 (Pushpa2)సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం, సుకుమార్ (Sukumar)ప్రొడక్షన్ పునుల్లో బిజీగా ఉన్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఆగస్టు 15న అనుకున్న టైమ్‌కి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పుష్ప2 రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో మేకర్స్ కూడా అంతే స్పీడ్ గా షెడ్యూల్ కు సినిమా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. పనులన్నీ సాఫీగా సాగుతున్నాయి.
పుష్పతో మాస్ ఇమేజ్ సంపాదించుకున్న బన్నీ పుష్ప2తో థియేటర్లలో దుమ్ము దులిపేందుకు సిద్ధమయ్యాడు. ఈ సీక్వెల్ లోనూ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ (Devisri Prasad) సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers),ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తోంది.
బాలీవుడ్ స్టార్ ఎంట్రీ :
లేటెస్ట్ టాక్ ప్రకారం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) కోసం పుష్ప 2 (Pushpa2)లో ఓ కీలక పాత్రను ప్లాన్ చేశారట. సినిమాలో ఓ హై పాయింట్ దగ్గర సంజయ్ దత్ పాత్ర ఎంట్రీ ఇస్తుందట. డాన్ క్యారెక్టర్‌లో సంజయ్ కనిపిస్తారని అంటున్నారు. కేజీఎఫ్ 2 (KGF2)లో సంజయ్ దత్ చేసిన అధీర పాత్రకి సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. విలన్ రోల్‌లో సంజయ్ ఇరగదీశాడు.
దీంతో పుష్ప 2 సినిమాలో సంజయ్ దత్ ఉంటే హిందీలో సినిమాకి ఇంకా ప్లస్ అవుతుందని మూవీ టీమ్ భావిస్తుందంట. అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే. కానీ ఇప్పటివరకూ మూవీ టీమ్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఈ సీక్వెల్‌లో పుష్పలో ఉన్న పాత్రలతో పాటు కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా ఉంటాయని తెలిసింది. ఇక భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ చేస్తున్న ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil)పుష్ప 2లో సినిమా మొత్తం ఉంటారని టాక్. ఎందుకంటే పుష్పలో సెకండాఫ్‌లో ఈ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది.