Netflix Owns Pushpa 2 digital rights: పుష్పా 2 డిజిటల్ రైట్స్ కొన్న నెట్ ఫ్లిక్స్.
2021లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప అల్లు అర్జున్ కెరీర్ లోనే గుర్తుంచుకొదగ్గ సినిమాగా నిలిచింది. ఈ సినిమా తో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా గెలుచుకున్నాడు.
పుష్ప సినిమా బాక్స్ ఆఫీసులో ఘనవిజయాన్ని సాదించింది. ఈ సినిమాతో అల్లుఅర్జున్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. అయితే ఈ సినిమా అసంపూర్తిగా అంటే మరో పార్ట్ కు మొదలుగా ముగిసింది.
ఇప్పుడు పుష్పకి సిక్వల్ గా వస్తున్న పుష్ప 2 ఆగస్టు 15, 2024 న స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా థియేటర్లలోకి ఘనంగా రాబోతుంది. ఈ పుష్ప 2 – ది రూల్ సినిమా కోసం దేశవ్యాప్తంగా పుష్ప అభిమానులు ఎదురుచూస్తున్నారు.
వచ్చే ఆగస్టు కోసం ఇప్పటినుంచే కౌంట్ డౌన్ వేసుకొని మరి ఎదురుచూస్తున్నారు.తాజాగా ఓ నివేదికలో పుష్ప 2 డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం.
OTT play ఇచ్చిన సమాచారం ప్రకారం పుష్ప 2 నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీస్ నెట్ ఫ్లిక్స్ కి డిజిటల్ రైట్స్ ని అమ్మిందని సమాచారం. అయితే పుష్ప 2 థియేటర్లలో విడుదల అయిన తర్వాత ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుంది.
పుష్ప 2 డిజిటల్ హక్కుల కోసం ముందుగా అమెజాన్ ప్రైమ్ చిత్ర నిర్మాణ సంస్థను సంప్రదించినట్టు ఉన్నత వర్గాల సమాచారం.
కానీ అమెజాన్ కన్నా మూడు రేట్లు ఎక్కువగా ఇవ్వడానికి నెట్ ఫ్లిక్స్ సిద్దామవ్వడంతో మైత్రి మూవీస్ నెట్ ఫ్లిక్స్ కే రైట్స్ విక్రయించింది.అయితే పుష్ప మొదటి పార్ట్ అమెజాన్ ప్రైమ్ 30 కోట్లతో కొనుగోలు చేసింది.
17 డిసెంబర్ 2021 లో విడుదల అయిన పుష్ప ది రైస్ ఘన విజయం సాధించింది. బాక్స్ ఆఫీస్ లో 360- 373 కోట్లు కొల్లగొట్టి అనేక రికార్డులు బద్దలగొట్టింది. విడుదల అయిన మొదటి రోజే 74కోట్లు వసూలు చేసింది. 2021 లో భారీగా కలెక్షన్లు సాధించిన చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.
69వ జాతీయ చలన చిత్ర అవార్డులలో పుష్ప సినిమాకి 2 గౌరవనీయమైన అవార్డులు దక్కాయి, ఒకటి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి వస్తే, మరొకటి ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ కి వచ్చింది.
67 వ ఫిల్మ్ ఫేర్ సౌత్ లో పుష్ప థి రైస్ ఎనమిది నామినేషన్లు పొందింది. వాటిలో 7 అవార్డులు అందుకుంది.
పుష్ప 2ని ఐదు భాషలలొ తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, మరియు హిందీ.
దాదాపు 500ల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పుష్ప2 పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా అత్యంత బడ్జెట్ లో నిర్మిస్తున్న భారతీయ సినిమాలలో ఒకటి.
పుష్ప 2 లో అల్లు అర్జున్, ఫహాద్ ఫాసిల్, రష్మిక మందన్నలతో పాటు జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, ధనుంజయ మొదలైన వారు నటిస్తున్నారు. మొదటి పార్ట్ లో ఉన్న తారగణమే రెండవ పార్ట్ లో కూడా ఉన్నారు.
పుష్ప 2 పైన మొదటి పార్ట్ కన్నా ఎక్కువ అంచనాలే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 కోట్లు వసూలు చేయవచ్చని అంచనా. దేశవ్యాప్తంగా 400 కోట్లు ఖచ్చితంగా వస్తాయంటున్నారు సినీవర్గాలు.
ఆంద్ర కొండలలో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి చదివిన సుకుమార్, దీని గురించి రిసెర్చ్ చేసి ఫీచర్ ఫిల్మ్ గా తీయాలనుకున్నాడు, అలా ఎర్ర చందనం దోపిడి కథనం లో కూలిగా మారిన ఒక స్మగ్లర్ గురించి ఈ కథ రాసుకున్నాడు.
ఆ తర్వాత ఈ కథ రాయలసీమ, చిత్తూరు జిల్లాల సమీపంలో జరుగుతుంది కాబట్టి ఆ గ్రామీణ నేపథ్యం ఉన్న యాసలో పట్టు ఉన్న నటుడి కోసం వెతికాడు.
అల్లు అర్జున్ కు చిత్తూరు యాసలో పట్టు ఉందని తెల్సుకున్న సుకుమార్ వెంటనే అతన్ని లుక్ టెస్ట్ చేయడానికి బాలీవుడ్ నుంచి ఒక టీం ని తీసుకువచ్చి లుక్ టెస్ట్ చేశారు.
2019 జులై లో పుష్ప ది రైస్ షూటింగ్ మొదలుపెట్టారు. విడుదల తరువాత వేంపల్లి గంగాధర్ అనే వ్యక్తి కాపీ రైట్ ఆరోపణ చేశాడు. ఈ కథ సాక్షి వార్తాపత్రిక కోసం తాను రాసిన కులీ అనే కథ నుండి దొంగలించబడినధని ఆరోపించాడు.
2021 డిసెంబర్ లో ఆంద్రప్రదేశ్ కోర్టులో ఊ అంటావా మావ.. అనే పాటకు వ్యతిరేకంగా పురుషుల సంఘం దావా వేశారు. ఈ పాత తమని కించపరిచినట్లుగా ఉందని.
మనోభావాలు దెబ్బతిన్నాయని,ఈ పాట పైన నిషేదం విధించాలని కోర్టులో అప్పీలు చేశారు.
ఇలా పుష్ప ది రైస్ ప్రేక్షకుల మెప్పు, గౌరవ ప్రదమైన అవార్డులతో పాటు ఇలాంటి వివాదలలో కూడా చిక్కుకుంది.