బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ…పుష్ప టీజర్ వచ్చేస్తోంది

website 6tvnews template 2024 04 03T152349.355 బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ…పుష్ప టీజర్ వచ్చేస్తోంది

pushpa 2 movie teaser solid update : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)కాంబోలో వస్తున్న మూవీ పుష్ప 2 (Pushpa2). ఈ సినిమా అనౌన్స్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప ది రూల్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

ఈ క్రమంలో వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు మూవీ టీమ్ ఈ మధ్యనే మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఎట్టిపరిస్థితుల్లో ఆగస్టు 15న పుష్ప2ను రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ చెప్పేశారు. అయితే త్వరలో బన్నీ బర్త్ డే ఉంది.

ఈ క్రమంలో ఫ్యాన్స్ సినిమా నుంచి ఓ స్పెషల్ వీడియోని ఎక్స్‎పెక్ట్ చేస్తున్నారు. వారి ఆనందం కోసమే బన్నీ పుట్టినరోజు నాడు పుష్ప2 టీజర్ (Pushpa 2 Teaser)రిలీజ్ చేస్తున్నామని ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్.

ఏప్రిల్ 8న టీజర్ :

ఏప్రిల్ 8న టీజర్ రిలీజ్ కానుంది. అయితే ఏ సమయానికి రిలీజ్ చేస్తారని కచ్చితమైన టైంని మెన్షన్ చేయలేదు. ఈ టీజర్ అప్డేట్ ను తెలిపేందుకు బన్నీ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. కాలికి గజ్జెలతో ఉన్న ఈ పిక్ నెట్టింట్లో దుమ్మురేపుతోంది. ఈ పిక్ జాతర సాంగ్ కి సంబంధించిందని తెలుస్తుంది.

జాతరలో పుష్ప అమ్మోరు గెటప్ లో డ్యాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఈ సెట్ బ్యాక్ డ్రాప్ లో ఓ అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ ఉంటుందట. టాలీవుడ్ లో దీని గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే సుకుమార్ (Sukumar)పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ సీక్వెన్స్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

పుష్ప-2పై భారీ అంచనాలు :

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమా బాక్సీఫీస్ వద్ద ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. పుష్పలో బన్నీ చెప్పిన తగ్గేదేలే డైలాగ్ ప్రపంచ నలుమూలలకు పాకింది. బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ మ్యానరిజంకు కనెక్ట్ అయ్యారు.

ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డుతో మరింత ఉత్సాహంతో సుకుమార్ (Sukumar)పుష్ప2 తెరకెక్కిస్తున్నాడు. పుష్ప సీక్వెన్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్ లో రూపొందుతున్న పుష్ప-2 (Pushpa2) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీకి కూడా దేవిశ్రీ ప్రసాద్ (Devisri Prasad)సంగీతం అందిస్తున్నాడు. మరి దేవిశ్రీ రూపొందించిన ఈ జాతర సాంగ్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Leave a Comment