సుకుమార్(Sukumar) దర్శకత్వం లో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్(Pushpa The Rise ). ఈ సినిమా ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ఈ చిత్రం అల్లు అర్జున్ ను జాతీయ ఉత్తమ నటుడిగా నిలబెట్టింది. 2021 లో వచ్చిన ఈ సినిమాకి రెండవ భాగం కూడా ఉంది.
అదే పుష్ప సినిమా సెకండ్ పార్ట్ కోసం అయన ఫాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొదటి భాగం వచ్చి దాదాపు మూడేళ్లవుతోంది. ఈ క్రమం లోనే పుష్ప 2 కి సంబంధించి ఒక ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
పుష్ప కి లీకేజి కష్టాలు : Pushpa facing leakage problems
పుష్ప 2 ను వెండితెర మీదికి తీసుకొచ్చే తేదీ విషయంలో దర్శకనిర్మాతలు ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15 న విదూకబోతున్న పుష్ప 2 కి సంబంధించి ఎప్పటికప్పుడు చిత్ర బృందం అప్ డేట్స్ ఇస్తూనే ఉంది. కానీ ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ఒక ఫోటో లీకవడం పై కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ ఫొటోలో అల్లు అర్జున్ బులుగు రంగు చీక కట్టుకుని సెట్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. పుష్ప సినిమా నుండి ఇలా ఫోటోలు లీకవడం కొత్తేమి కాదు, గతంలో పుష్ప సినిమా మొదటి భాగం తెరకెక్కిస్తున్న సమయంలో కూడా ఇలాగె ఫోటోలు లీకయ్యాయి.
దీంతో జాగ్రత్త పడిన యూనిట్ బయటి వారిని సెట్ లోకి అనుమతించడం నిషేధించింది. కానీ లెక్కల మాస్టర్ వేసిన లెక్కకి అందని ఓ పోకిరి పుష్ప సెట్ లో అల్లు అర్జున్ ఫోటో తీసి బయటకు వదిలాడు.
ఇక ఈ రెండవ పార్ట్ లో రష్మిక మందన్న(Rashmika Mandanna), మలయాళ నటుడు ఫాహద్ ఫాసిల్ (Fahadh Faasil) రావు రమేష్(Rao Ramesh) కీలక పాత్రల్లో కనిపిస్తారు.