‘Pushpa’ actor Jagdish arrested: పుష్ప ఫేమ్ కేశవ అలియాస్ జగదీశ్ అరెస్ట్ – కారణాలు తెలిస్తే ఛీ కొడతారు.

'Pushpa' actor Jagdish arrested

‘Pushpa’ actor Jagdish arrested: పుష్ప నటుడు కేశవ అరెస్ట్.. ఏమైందంటే

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి ఎంత పేరొచ్చిందో అదే స్థాయిలో అల్లు అర్జున్ కి ఆ సినిమా లో రైట్ హ్యాండ్ గా ఉన్న కేశవ కి కూడా అంతే పేరొచ్చింది. జబర్దస్త్ వంటి షోలో కూడా పుష్ప స్పూఫ్ చేయాలంటే కేశవ క్యారెక్టర్ లేకుండా కంప్లీట్ చేయలేదంటే ఆ క్యారెక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఎంతుందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన రొమాంటిక్ సీన్లు, సాంగ్స్ లో తప్ప దాదాపు అన్ని సన్నివేశాల్లో కథానాయకుడితో పాటు త్రూ అవుట్ సినిమాలో కనిపించాడు ఈ కేశవ. అయితే అతని ఒరిజినల్ నేమ్ కేశవ కాదు. అతని పేరు జగదీశ్.

మరి జగదీశ్ సినిమాలో కనిపించినంత అమాయకుడైతే కాదని అంటున్నారు పంజాగుట్ట పోలీసులు. అంతే కాదు ఒక మహిళను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడు అనే అభియోగం మీద జగదీశ్ ను అరెస్ట్ కూడా చేశారు.

అసలు చేసిన పనేంటి అతడిని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు అనే వివరాల్లోకి వెళ్లే ముందు జగదీశ్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. పుష్ప సినిమాలో కేశవ్ గా కనిపించిన జగదీశ్ ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలోని ఏదో ఒక గ్రామం లో పుట్టి ఉంటాడని అంతా అనుకుంటారు. కానీ అతనిది తెలంగాణ రాష్ట్రం పక్క తెలంగాణ బిడ్డ.

అతను పుట్టి పెరిగింది వరంగల్ లో. సినిమాల మీద మక్కువ తో హైదరాబాద్ కి మకాం మార్చాడు. మొదట్లో కొన్ని కష్టాలు పడినప్పటికీ తరువాత మాత్రం లఘు చిత్రాలు, వెబ్ సీరీస్ లో అవకాశం దక్కించుకున్నాడు. ఇక ఇతని తండ్రికి మాత్రం జగదీశ్ ను పోలీస్ చేయాలనీ ఉండేదట. కానీ జీవనం గడవడం కోసం జగదీశ్ సినిమా హాళ్ళకి స్నాక్స్ సప్లై చేశానని కూడా చెప్పాడు ఒక ఇంటర్వ్యూ లో.

ఇక హైద్రాబాద్ లో నటుడిగా నిలదొక్కుకునే క్రమంలో జగదీశ్ కి నిరుద్యోగ నటులు అనే వెబ్ సీరీస్ లో అవకాశంలాభించింది.

'Pushpa' actor Jagdish arrested

ఆతరువాతే అత్తకి మల్లేశం, పలాస 1978 వంటి సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కింది. అయినప్పటికీ జగదీశ్ వెబ్ సీరిస్ ను కూడా విడిచి పెట్టలేదు. నిరుద్యోగ నటుల తోపాటు, గాడ్స్ ఆఫ్ ధర్మపురి, కొత్త పోరడు వంటి వెబ్ సీరీస్ లో కూడా నటించాడు. ఇటువంటి వెబ్ సీరీస్ అలాగే సినిమాల వల్లనే అతనికి పుష్ప లో అల్లు అర్జున్ తో కలిసి నటించే షన్స్ దక్కింది.

ఇక జగదీశ్ రియల్ లైఫ్ లో చేసిన తొందరపాటు పని వల్లనే అతను ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఏ రంగంలోని వారికైనా క్రమశిక్షణ తప్పక అవసరమే, అయితే సినీ, రాజకీయ, క్రికెట్ రంగాల్లో వారికి మాత్రం ఆ క్రమశిక్షణ అనేది మరింత ఎక్కువ అవసరం. ఎందుకంటే ఈ రంగాల్లోని ప్రముఖుల మీద ఎల్లప్పుడూ ప్రజల దృష్టి ఉంటుంది.

వారు ఏ మాత్రం తప్పటడుగు వేసినా, పరువు గంగపాలు అవుతుంది పైగా కెరియర్ కూడా నాశనం అవుతుంది. ఇప్పుడు జగదీశ్ విషయంలో కూడా అదే జరగబోతోంది. జగదీశ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక మహిళతో సన్నిహితంగా ఉండేవాడు, అయితే ఈ మధ్య కాలంలో ఆమె మరో వ్యక్తికీ దగ్గరైంది, పైగా ఆమె అతనితో క్లోస్ గా ఉన్న సమయంలో తీసిన ఫొటోస్ ను చూపించి బెదిరించాడట. దీంతో ఆమెకు ఏ మార్గం పాలుపోక చివరికి ఆత్మహత్యకు పాల్పడింది.

గత నెల 27 వ తేదీనుండే అతను ఆమెను బెదిరిస్తూ వచ్చాడని పోలీసులు అభియోగం లో ఉన్నట్టు తెలుస్తోంది. మహిళ ఉరి వేసుకుని ప్రాణాలు విడిచింది, అప్పటి నుండి జగదీష్ కూడా తప్పించుకుని తిరుగుతుండగా పోలీసులు ఇప్పుడు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే పోలీసులు మొదట జగదీశ్ ను లోతుగా విచారణ చేయనున్నారు. ఒకవేళ జగదీశ్ తప్పు చేసినట్టు తేలితే అతనిపై చట్టప్రకారం చర్యలు తప్పని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే జగదీశ్ పుష్ప పార్టీ 2 లో కూడా నటిస్తున్నట్టు సమాచారం ఉంది. కానీ అతని పై చిత్రీకరించాల్సి సన్నివేశాలు పూర్తయ్యాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఒక వేళా జగదీశ్ గనుక ఈ నేరం చేసినట్టు రుజువైతే అతని నట జీవితానికి తెరపడినట్టే. ఎందుకంటే ఇలాంటి నేర ప్రవ్రుత్తి కలిగిన నటులను తమ సినిమాల్లో పెట్టుకున్నప్పుడు వారు ఏదైనా కేసులో అరెస్ట్ అయితే గనుక ఆ సినిమాలను మధ్యలో ఆపేయాల్సి ఉంటుంది లేదంటే, మరొకరిని పెట్టుకుని ఆ సన్నివేశాలన్నిటిని రీ షూట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏ నిర్మాత కూడా ఇలాంటి ప్రయోగానికి ఇష్టపడరు కాబట్టి వీరిని పూర్తిగా పక్కన పెట్టేస్తారు.

Leave a Comment