జగన్ పై రఘురామ మరో అస్త్రం Raghurama Raju New Point on Jagan
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సమయం దొరికిన ప్రతిసారి ఆ పార్టీ అధినేత ను ఒక రేంజ్ లో ఆడేసుకుంటూ ఉంటారు. వైసీపీ అవలంబిస్తున్న విధానాలను ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకి పారేస్తూ ఉంటారు. సొంత పార్టీలోని మంత్రులను, ఎమ్మెల్యే లను కూడా దుమ్ము దులిపేస్తుంటారు.
మరీ ముఖ్యంగా ఏపీలోని ల్యాండ్, సాండ్, లిక్కర్ మాఫియా పై అయన నిప్పులు చెరుగుతుంటారు. ఇదే క్రమంలో అయన వై.ఎస్ జగన్ పై మరో బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యారు. జగన్ కి సంబంధించి అవినీతి కేసులను త్వరితగతిన విచారణ జరిపించాలని ఆయన కోరుతూ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు.
జగన్ ఆస్తుల కేసుల విచారణ పదేళ్లుగా కొనసాగుతూనే ఉందని, అందుకే ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని అందులో కోరారు. ఆయన వేసిన ఈ పిటిషన్ ను జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిల ధర్మాసనం శుక్రవారం నాడు విచారించనుంది.
ఇక ఈ పిటిషన్ లో రఘురామ ఏయే అంశాలను ప్రస్తావించారంటే..సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటివరకు 3,041 సార్లు వాయిదా పడ్డాయని చెప్పారు. ఆ కేసుల విచారణ త్వరగా పూర్తిచేయాలని నిందితులకు శిక్ష విధించాలని సీబీఐ కి ఉన్నట్టు కనిపించడం లేదన్నారు.
ప్రధాన నిందితుడు జగన్ ఇష్టానుసారంగా వాయిదాలు కోరేలా స్వేచ్ఛను ఇచ్చారని చెప్పారు. విచారణ పూర్తయ్యే సంగతి ఏమోకానీ అసలు ప్రారంభమయ్యే సూచనే కనిపించడం లేదన్నారు. అందుకే సుప్రీం కోర్టు ఈ కేసులో జోక్యం చేసుకోవాలని కోరారు.
జగన్ పై రఘురామ మరో అస్త్రం Raghurama Raju New Point on Jagan