ఇటీవల YCP పార్టీ లో ఎన్నో అవమానాలు అనుభవించి పార్టీ ఇమడలేక ఆ పార్టీ విడిచి బయటకు వచ్చిన రఘురామ కృష్ణంరాజు ఈరోజు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్ళు TDP లో చేరుతారు అంటూ ఊహాగానాలు వచ్చిన నేపద్యం లో ఈరోజు ఆయన అధికారికంగా TDP లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు సమక్షంలో TDP కండువా కప్పుకోనున్నారు రఘురామ కృష్ణంరాజు. ఈ మేరకు ఆయన ఒక కీలక ప్రకటన కుడా చేశారు.
అయితే తాను జగన్ మోహన్ రెడ్డిపై చేసిన పోరాటమే తనకు శాపం అయిందని ఆయన అన్నారు. ఆ సమయం లో తాను ఎంతో ఆవేదన అనుభవించానని చెప్పుకొచ్చారు. నేను దేనికోసం ఆశించ కుండా , ఎటువంటి ఆపేక్ష లేకుండా కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల మేలు కోసమే తాను పోరాటం చేశానని ఆయన చెప్పారు. ఎందరెందరో, ఎవరెవరో పార్టీలను పెట్టుకుంటున్నారని, తనకు కుడా రాజకీయంగా స్వార్థం ఉన్నట్లయితే ఏమో తాను కూడా ఒక పార్టీ పెట్టి ఉండే వాడినేమోనని తన మనసు లో ఉన్న అభిప్రాయం చెప్పారు.
కాని నేను అలా చెయ్యలేదని దీనిని బట్టే నా గురుంచి, నేను అలాంటి వాడినో అర్ధం అవుతుందని ఆయన అన్నారు. కానీ తనకు అటువంటి స్వార్థం లేడు కాబట్టే ఇంత కాలం మౌనం వహించానని ఆయన చెప్పారు. తాను మనసా వాచా కర్మణా ఎల్లప్పుడూ కోరుకుంటున్నది ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే తప్ప నాకు వేటి మీద అధికార కాంక్ష లేదు అని అందుకే అన్ని ఆలోచించి శ్రామికుడైన చంద్రబాబు నాయుడుని మళ్ళీ గెలిపించి ఆయన ముఖ్యమంత్రి కావాలని మాత్రమే నేను ఈ TDP పార్టీ లో చేరుతున్నట్లు ఆయన చెప్పారు.