Rahul Bharat Jodo Nyay Yatra: రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర.

Rahul Bharat Jodo Nyay Yatra.

Rahul Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) సెప్టెంబర్ నెల 2022 లో ప్రారంభించారు.

భారత దేశం మొత్తం వివిధ ప్రాంతాల మీదుగా పాదయాత్ర తో పర్యటిస్తూ ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలు తెలుసుకునే యాత్రే భారత జోడో యాత్ర.

ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీకి(Congress Party), రాహుల్ గాంధీకి మంచి పేరు తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. పైగా ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని, పార్టీ పట్ల నమ్మకాన్ని పెంచింది.

ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ 10,000 కిలోమీటర్లు(10K Kilomeeters) ప్రయాణించి 200 పట్టణాల్లోని ప్రజలకు చేరువయ్యారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టడం లోని ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలు తెలుసుకోవడం అందుకే అన్నిరకాల వారాగాల వారితో అయన మమేకమయ్యారు.

విద్యార్థులు(Students), కార్మికులు(Daily Labour), వృద్దులు, ఉన్నతవిద్యావంతులు, రైతులు(Formers), రైతు కూలీలు, డ్రైవర్ సోదరులు(Drivers), ఇలా అందరితో మమేకమయ్యారు.

ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీని ఎంత వరకు లాభాన్ని చేకూర్చింది అన్న విషయాన్నీ పక్కన పెడితే, రాహుల్ గాంధీ పొలిటికల్ కెరియర్ కి మంచి మైలేజ్ ను ఇచ్చింది.

ఈయాత్ర ద్వారా రాహుల్ ప్రజలతో మమేకమయ్యారు. అనేక ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు రాహుల్ తో కలిసి మాట్లాడేవారు, అలా చేయడం వల్ల రాహుల్ పై ఉన్న కొన్ని అపోహలు దూది పింజల్లా తేలిపోయాయి.

ఇప్పుడు భారత్ జోడో న్యాయ్ యాత్ర : Bharat Jodo Nyaay Yatra

భారత్ జోడో యాత్ర విజయవంతం అవ్వడంతో రాహుల్ గాంధీ మరో యాత్రకి శ్రీకారం చుట్టారు. అదే న్యాయ్ జోడో యాత్ర. దీని పూర్తి పేరు, భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyaay Yatra).

ఈ యాత్రను ప్రారంభించడానికి రాహుల్ గాంధీ ముహుర్తాన్ని మాత్రమే కాదు ప్లేస్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈ నెల 14వ తేదీన మణిపూర్(Manipur) లోని ఇంపాల్(Impal) లో ఈ యాత్ర ప్రారంభం కానుంది.

ఈ యాత్ర 44 రోజుల పాటు కొనసాగనుంది తెలుస్తోంది. అయితే ఎక్కువ రోజులు అంటే 11 రోజుల పాటు ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) లో సాగుతుందని అంటున్నారు.

ఆరాష్ట్రం లో రాహుల్ గాంధీ 1,074 కిలోమీటర్లమేర పాదయాత్ర ఉండనుంది. మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే ఈ యాత్ర 15 రాష్ట్రాల్లోని(15 States) 337 అసెంబ్లీ స్థానాలు,

100 జిల్లాలను కవర్ చేస్తూ వెళుతుందట. ఇది తప్పకుండ రాహుల్ ను మరింత రాటుదేలేలా చేస్తుందని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు.

Leave a Comment