Rahul Ravindran: చిన్మయి వల్ల ఆఫర్స్ తగ్గాయి..భర్త రాహుల్ షాకింగ్ కామెంట్స్

WhatsApp Image 2024 03 08 at 10.54.59 AM Rahul Ravindran: చిన్మయి వల్ల ఆఫర్స్ తగ్గాయి..భర్త రాహుల్ షాకింగ్ కామెంట్స్

దక్షిణాదిన సింగర్ గా మంచి గుర్తింపు సాధించింది చిన్మయి(Chinmayi). తెలుగు, తమిళంలో ఎన్నో పాటలు పాడి ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. పాటలే కాదు డబ్బింగ్ ఆర్టిస్టుగానూ బాగా ఫేమస్ అయ్యింది. సమంత (Samantha )లాంటి స్టార్ హీరోయిన్లకు వాయిస్ ఇచ్చి అందరిని మెస్మరైజ్ చేసింది. మీటూ ఉద్యమం టైంలో చిన్మయి తమిళ రచయిత వైరముత్తు (Vairamuthu)మీద సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

ఫారెన్ కంట్రీస్ లో ప్రోగ్రామ్స్‌కు వెళ్లినప్పుడు తనను వైరముత్తు వేధించాడని చెప్పి అప్పట్లో చిన్నమి ఇండస్ట్రీలో సంచలనం రేపింది. చిన్మయితో పాటు ఇండస్ట్రీకి చెందిన మరికొంత మంది మహిళలు కూడా వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయన చెప్పిన మాటలు వినలేదని తన కెరీర్ మీద దెబ్బ కొట్టాడని, చిన్మయి ఏకంగా సీఎం స్టాలిన్() కు కూడా అప్పట్లో లేఖ రాసింది. అయినా అతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా తమిళ సినీ ఇండస్ట్రీ చిన్మయిపైనే బ్యాన్ విధించింది.

తమిళ సీఎంపైనా చిన్మయి ఆరోపణలు :

తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికీ వైరముత్తు వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గత ఏడాది వైరముత్తు రాసిన ‘మహా కవితై’ (Maha Kavithai) అనే బుక్ ను తమిళనాడు సీఎం స్టాలిన్ (Stalin), కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం(P.Chidambaram)సీనియర్ యాక్టర్ కమల్‌ హాసన్ (Kamal Haasan) లాంచ్ చేశారు.

ఈ విషయంపైన చిన్మయి తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. “నన్ను లైంగికంగా వేధించిన వ్యక్తితో కలిసి తమిళనాడులోని ప్రముఖులు వేదికను షేర్ చేసుకున్నారు. ఆయన నిజ స్వరూపం గురించి చెప్పిన నన్ను ఇండస్ట్రీ నుంచి నిషేధించారు. నా కెరీర్ మొత్తం కోల్పోయాను. ఇక ఇప్పుడు నేను చేసేది ఏమీ లేదు” అని చిన్మయి అప్పట్లో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కూడా పెద్ద దుమారమే రేపింది. ఇప్పటికీ చిన్మయి తనకు జరిగిన అన్యాయంపై న్యాయపరంగా పోరాడుతోంది.

WhatsApp Image 2024 03 08 at 10.55.29 AM Rahul Ravindran: చిన్మయి వల్ల ఆఫర్స్ తగ్గాయి..భర్త రాహుల్ షాకింగ్ కామెంట్స్

తమిళంలో ఆఫర్స్ తగ్గాయి :

ఈ విషయంలో భర్త రాహుల్(Rahul)సపోర్ట్ ఎప్పుడూ చిన్మయి(Chinmayi)కి ఉంటుంది. ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో చిన్మయి గురించి ఆమె చేసే న్యాయ పోరాటం గురించి కామెంట్ చేశాడు . “వైరముత్తు (Vairamuthu) మీద ఆరోపణలు చేసిన తర్వాత కోలీవుడ్ లో నాకు వర్క్ తగ్గింది. అయినా నాకేం ఇబ్బంది లేదు. ఈ విషయంలో తనకు నేను ఎప్పుడూ సపోర్ట్ గానే ఉంటాను. చిన్మయికి ధైర్యం ఎక్కువ. ఆమెకు నేను జస్ట్ ఎమోషనల్ గా మద్దతు ఇస్తున్నాడు.

ఇంటికి వస్తే ఇవన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఉంటాం. నేను ఈ విషయం గురించి తనతో మాట్లాడ్డం కూడా మానేశాను. ఇందులో నాకు ఎలాంటి క్రెడిట్ లేదు. తనకు జరిగిన అన్యాయం గురించి చిన్మయి కొట్లాడుతోంది. చిన్మయి వైరముత్తు గురించి బయట పెట్టాక నాకు తెలిసి అమ్మాయిలకు ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు నాకు తెలిసింది. ఇలాంటి విషయాల గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే మీ పరువే పోతది అనేలా కొంత మంది వ్యవహరిస్తుంటారు. మాట్లాడితే మనమే ఏదో తప్పు చేశాం అన్నట్లుగా చూస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. చిన్మయి మాట్లాడ్డం మొదలుపెట్టాక చాలా మంది అమ్మాయిలు బయటపడ్డారు. తమకు జరిగిన అన్యాయాన్ని చెబుతున్నారు. ఈ కేసులో చిన్మయికి తప్పకుండా న్యాయం జరుగుతుంది”.అని రాహుల్ తెలిపాడు.

Leave a Comment