Rain alert : తెలంగాణ కు వర్ష సూచన..ఈ జిల్లాలకు ముదురు రోజులు వానలు..ఎందుకు అప్రమత్తంగా ఉండాలంటే..
ఉన్నట్టుండి హైదరాబాద్ మహానగరాన్ని వర్షం కమ్మేసింది. అందుకు కారణం ఈశాన్య రుతుపవనాలు అంటున్నారు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అధికారులు.
ఈ వర్షాలు మూడు రోజుల పాటు ఉంటాయని కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాక మరి కొన్ని జిలాల్లో కూడా వర్ష సూచన ఉందని చెబుతున్నారు.
నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్, ములుగు, కొత్తగూడెం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో చెదురుమొదురు జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు.
ఇక హైదరాబాద్ లోని మోహదీపట్నం, జూబ్లీచెక్ పోస్ట్, యూసుఫ్‌గూడ, అమీర్ పేట్, పంజాగుట్ట, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, దోమలగూడ, హిమాయత్ నగర్, అశోక్ నగర్, ఎల్బీనగర్, మియాపూర్, సింద్రాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
దీంతో రోడ్లపై వర్షపు నీరు నిలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి.
తెలంగాణలోని పలు జిల్లాల్లో నమోదైన వర్షపాతాన్ని చుస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో 10.2 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో 5.9 సెం.మీ వర్షపాతం నమోదవగా, నల్గొండ జిల్లా చండూరు మండలంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ముఖ్యంగా నేడు పగటిపూట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్, రాత్రి సమయంలో 22 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.
వర్షాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు, అలాగే జీహెచ్ ఎంసి అధికారులు సూచిస్తున్నారు.
సీతాకం ప్రారంభంలో కురిసే ఇలాంటి వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు తమ ఇళ్ల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.