అన్ సీజన్ వానలతో జాగ్రత్త సుమా..!!

మండే ఎండల్లో వానజల్లు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అసలే ఈ ఏడాది ఎండలు మాడిపోతాయి అని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్న తరుణంలో..భానుడు కూడా తన ప్రతాపం ఏప్రియల్ నుండే చూపిస్తున్నాడు. గత నెలలోనే చాలా చోట్ల ఎండలు 40 డిగ్రీలు దాటిపోయాయి. గత వారంరోజులుగా కొన్ని చోట్ల 45 డిగ్రీలు కూడా టచ్ అవుతోంది.

Rain అన్ సీజన్ వానలతో జాగ్రత్త సుమా..!!

అయితే రెండు రోజుల నుండీ సాయంత్రానికి మబ్బులు పట్టి చల్లపడుతోంది. పలు చోట్ల పడుతున్న వానలు కొంత వూరటే అయినా అన్ సీజన్లో కురుస్తున్న వానలు చల్లటి వాతావరణం వల్ల మరింత జాగ్రత్తలు అవసరం అని వైద్యులు అంటున్నారు. పగలు అంతా ఉక్కపోత, ఎండతో సతమతమయ్యే మన శరీరం సాయంత్రానికి చల్ల వాతావరణానికి తొందరగా అలవాటు పడదట. ఒకేరోజు ఇలా హీట్- కూల్ కాబినేషన్ వెంట వెంటనే శరీరాన్ని తాకటం వల్ల తలనెప్పి, జలుబు, జ్వరం బారిన పడే అవకాశం ఎక్కువ వుంది. ఊపిరితిత్తుల సమస్యలు చర్మ సంబంధిత వ్యాధులు వున్నవారు ఇలాంటి వాతావరణం వల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు అని వైద్యులు అంటున్నారు. ఇలా వెంట వెంటనే మారుతున్న వాతావరణానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు.

  • పిల్లలు, ముసలి వారు ఈ గజిబిజి వాతావరణంలో అస్సలు బయటకు రాకపోవటమే మంచిది.
    కూలింగ్ వాటర్, ఫ్రిజ్లో పెట్టిన ఆహార పదార్ధాలు వీలు అయినంత వరకూ వాడక పోవటమే మంచిది.
  • చమట ఎక్కువ పీల్చే వదులుగా వుండే కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి.
  • ఎయిర్ కండీషన్, ఫ్రీజ్ లకు వీలు అయినంత దూరంగా ఉండాలి.
  • తేలిగ్గా అరిగే ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి.
    రోజుకు కనీసం 5 లీటర్ల నీళ్ళు తాగటం ఉత్తమం.
    మాంసాహారం తీసుకోకపోవటమే మంచిది.
    ఆహారం కొద్ది కొద్దిగా రోజుకు 5-6 సార్లు తీసుకోవటం మంచిది.
    పిల్లలను ఈ ఆన్ సీజన్ వానలో తడవ కుండా చూసుకోవాలి.
    బయట ఫుడ్ కి, ముఖ్యంగా కూల్ డ్రింక్ లు, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి
  • జలుబు, జ్వరం వొస్తే వెంటనే ఏవేవో మందులు వాడకుండా వైద్యుని దగ్గరకి పోవటం మంచిది. కరోనా తర్వాత అందరికీ స్వంత వైద్యం ఎక్కువైంది. ఛాతీ, హెడ్ లో అసహనంగా వుండే స్వంత వైద్యం జోలికి పోకుండా డాక్టర్ని సంప్రదించాలి.

Leave a Comment