Breaking News

Rain forecast for AP : ఏపీకి వర్ష సూచన

303810 rain Rain forecast for AP : ఏపీకి వర్ష సూచన

Rain forecast for AP : ఏపీకి వర్ష సూచన

వాతావరణ శాఖ ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురుస్తాని చెబుతోంది. నైరుతి బంగాళాఖాతం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో సముద్రంపై తమిళనాడు నుంచి రాష్ట్రంలో కోస్తా వరకు తూర్పుగాలులు బలంగా వీస్తున్నాయి.

దీంతో కోస్తాలోని పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరులో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇక గురువారం నాడు కోస్తాతోపాటు, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అదే విధంగా నేడు అల్లూరి సీతారామరాజు , డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లా, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

అలాగే శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా రాయలసీమ లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక నవంబర్ మాసం కూడా రావడంతో పగటి పూట ఎండ ఉన్నప్పటికీ రాత్రి సమయంలో చలి గాలులు వీస్తున్నాయి.

ఈ నెలలో వానలు కురుస్తాయని అంచనా వేసినప్పటికీ , రైతన్నలు ఆశించిన స్థాయిలో మాత్రం వర్షాలు కురిసేలా కనిపించడం లేదని అంటున్నారు వాతావరణ నిపుణులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *