Sri Rama Photo On 500 Note : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైన వేళ అయన ఒక డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. భారత కరెన్సీ 500 రూపాయల నోటుపై రాముడి బొమ్మను ముద్రించాలని అయన కోరుతున్నారు.
థాయిలాండ్(Thailand), అమెరికా(America), ఇండొనేషియా(Indonesia) అలాగే యూరోప్(Europe) లోని కొన్ని దేశాలు వారి కరెన్సీ నోట్లపై హిందూ దేవతల విగ్రహాలను రూపాలను ముద్రించాయని అన్నారు. కాబట్టి మన కరెన్సీ పై శ్రీరాముడి రూపాన్ని ముద్రిండం సమంజసమే అని తన వాదనను వినిపించారు రాజా సింగ్.
ఇది మతాలకు సంబంధం లేని విషయమని చెప్పే ధోరణిలో అయన ఇండోనేషియాను ఉదహరించారు. ఇండోనేసియాలో 80 శాతం ముస్లిం లే ఉంటారని కానీ అక్కడి కరెన్సీ నోట్లపై హిందూ దేవతల బొమ్మలు ఉంటాయని అన్నారు.
ఇది తన ఒక్కడి కోరిక మాత్రమే కాదని మనదేశంలోని కోట్లాది మంది హిందువుల అభీష్టం కూడా ఇదేనని చెప్పారు. మన దేశంలో తరతరాలుగా కోట్లాది కుటుంబాలు శ్రీ రాముడిని పూజిస్తూ వస్తున్నాయని అన్నారు.