Raja Yoga from December 16: డిసెంబర్ 16 నుంచి రాజయోగం…ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక రాశిలో వేరే రాశులు కలిసి ఉన్నప్పుడు కొన్ని ప్రయోజనకరమైన యోగాలు ఏర్పడుతాయి. అలాంటి వాటిల్లో ఒకటే బుధాదిత్య యోగం. సూర్యుడు 16 డిసెంబర్ 2023న ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
జనవరి 15, 2024 వరకు ఆ రాశిలోనే సూర్యుడు ఉంటాడు. బుధుడు ఇప్పటికే ధనస్సు రాశిలో ఉండడం వల్ల ఈ నెల డిసెంబర్ 16 నుంచి బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ఈ నెల రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు ఉండవు.
ఈ బుధాదిత్య రాజయోగం ప్రభావం పన్నెండు రాశులపై ఉన్నప్పటికీ ముఖ్యంగా మూడు రాశులవారికి అత్యంత అనుకూలంగా ఉండబోతోంది.
నెల రోజుల పాటు వారికి శుభఫలితాలు ఉంటాయి. మరి ఆ రాశులకు ఈ రాజయోగం వల్ల కలిగే అనుకూల ఫలితాలేంటో చూద్దాం.
మేషరాశి:
మేషరాశి వారికి ఈ బుధాదిత్య రాజయోగం చాలా మేలు చేస్తుంది. వీరు ఏం చేసినా సరే పట్టిందల్లా బంగారం అవుతుంది. చేపట్టిన ప్రణాళికలు విజయవంతం అవుతాయి.
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా కూడా లాభం ఉంటుంది. మేషరాశి జాతకుల జీవితాల్లో గణనీయమైన పురోగతి కలుగుతుంది. ఉన్నత స్థానాల్లోకి వెళతారు. కొత్త అవకాశాల ద్వారా మరింతగా లాభం కలుగుతుంది. పెట్టుబడుల నుంచి లాభాలను గడిస్తారు.
కన్య రాశి:
సూర్యగ్రహ సంచారం వల్ల ఏర్పడిన ఈ బుధాదిత్య రాజయోగం కన్యారాశివారికి మేలు చేస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కొత్త ఇల్లు, కారు, బంగారం లాంటి వాటిని కొనుగోలు చేస్తారు. కుటుంబంలో అనుబంధాలు మరింత విస్తరిస్తాయ.
ప్రశాంతమైన వాతావరణం ఇంటా బయటా అంతటా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఇప్పటివరకు ఉన్న ఒత్తిడులు అన్నీ దూరమయి మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటుంది. పూర్వికుల ఆస్తి దక్కే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లాంటి రంగాలలో ఉన్నవారికి చాలా అనుకూలమైన కాలం.
ధనస్సు రాశి:
ఈరాశి వారికి ఈ యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు, ఇంకా బుధుడు ఇద్దరూ కూడా ఈ రాశిలోనే ఉంటున్నారు కాబట్టి మరింత మంచి ఫలితాలు ఏర్పడతాయి. ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా పుంజుకుంటుంది.
మీ వ్యక్తిత్వాన్ని నలుగురూ గౌరవిస్తారు. అవివాహితులకు వివాహం కుదురుతుంది. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ప్రజలలో కీర్తి ప్రతిష్టతలు పెరుగుతాయి. కొత్త ఆదాయ వనరులు ఉంటాయి.