Rajamouli shocked by Hanuman Director hot comment : సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ (Hanuman)మూవీ సెన్సేషనల్ హిట్ సాధించింది. తేజ్ సజ్జా (Tej Sajja) హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth varma) రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
తక్కువ బడ్జెట్‌లో యంగ్ స్టార్స్ తో హనుమాన్ మూవీ తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నాడు ప్రశాంత్. సినిమా విడుదలై 18 రోజులు అయినప్పటికీ నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.
ప్రస్తుతం హనుమాన్ టీం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా హనుమాన్ మేనియా కనిపిస్తోంది. ఈ మూవీపైనే చర్చ నడుస్తోంది. ఈ క్రెడిట్ అంత కేవలం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth varma)కే దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాను ఎంచుకున్న కథపై ఫుల్ క్లారిటీ, తీసుకున్న పాయింట్ ను ఏమాత్రం తడబడకుండా అద్భుతంగా స్క్రీన్ ప్రజంటేషన్ చేసి హిట్ డైరెక్టర్ గా పేరుసంపాదించుకున్నాడు. కేవలం రూ.40 కోట్లతో అద్భుతమైన గ్రాఫిక్స్ తో హనుమాన్ మూవీ తీసిన తీరు భారతీయ చలనచిత్ర పరిశ్రమని అవాక్కయ్యేలా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది హనుమాన్.
దీంతో ఇప్పుడు ప్రశాంత్ వర్మ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ క్రమంలో ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli)పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. దర్శకధీరుడు రాజమౌళి అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన ప్రశాంత్ ఆయనమీద ఓ సందర్భంలో కోపం వచ్చిందని చెప్పాడు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
I have talent but he Rejected me : టాలెంట్ ఉన్నా నన్ను రిజెక్ట్ చేశారు
ఇంటర్వ్యూలో ప్రశాంత్ (Prashanth)మాట్లాడుతూ…” రాజమౌళి (Rajamouli)గారి మేకింగ్ చాలా బాగుంటుంది. ఆయన మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఆయన దగ్గర అసిస్టెంట్ చేరాలని చాలా ట్రై చేశాను. ఎన్నో మెయిల్స్ పంపించాడు.
కానీ, ఆయన వాటిని రిజెక్ట్ చేశారు. నాకు టాలెంట్ ఉన్నా ఆయన నన్నెందుకు తీసుకోలేదని ఆయనపై చాలా కోపం వచ్చింది. ఇక అప్పుడే నేను ఏకలవ్యుడు అవుదామని నిర్ణయించుకున్నా. రాజమౌళి గారి సినిమాలు చూశాను. ఆయన మేకింగ్ వీడియోల ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నా”.అని ప్రశాంత్ తెలిపాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Ravi Teja in Prashanth Cinematic Universe : ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌లో రవితేజ
ప్రశాంత్ వర్మ(Prasanth varma) ఫస్ట్ మూవీ ‘అ!’ (Aa)లో చేప క్యారెక్టర్ కు టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) వాయిస్ అందించారు. లేటెస్టుగా ‘హనుమాన్’ (Hanuman) మూవీలోనూ కోటి అనే కోతి క్యారెక్టర్ కు ఆయనే వాయిస్ అందించారు.
ఈ క్యారెక్టర్ కు వయిస్ ఇచ్చారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ విషయాన్నిడైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తావిస్తూ.. తన సినిమాటిక్ యూనివర్స్‌లో ఆ క్యారెక్టర్ ను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
రవితేజ గారు ఓకే చెబితే కోటి క్యారెక్టర్ తో ఒక మూవీ చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టాడు ప్రశాంత్. ఈ కామెంట్స్ తో భవిష్యత్తులో ప్రశాంత్ తన సినిమాటిక్ యూనివర్స్ లో రవితేజను కూడా భాగస్వాముడిని చేస్తాడని అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ప్రశాంత్ ఇప్పుడు అధీర (Adheera) అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో ఆర్ఆర్ఆర్(RRR) మూవీ ప్రొడ్యూజర్ దానయ్య (Danaiah) కుమారుడు దాసరి కళ్యాణ్ (Dasari Kalyan) ని హీరోగా ఇంట్రడ్యూజ్ చేయబోతున్నాడు.