Thalaivar 171: సూపర్ స్టార్ రజినీకాంత్ ..అలాంటి పాత్ర చేస్తున్నారా?

WhatsApp Image 2024 03 31 at 6.47.40 PM 1 Thalaivar 171: సూపర్ స్టార్ రజినీకాంత్ ..అలాంటి పాత్ర చేస్తున్నారా?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth ) యంగ్ డైరెక్టర్లే కావాలంటున్నారు. వరుసగా వారికే అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో లోకేష్ కనకరాజు ( Lokesh kanakaraj ) ట్రెండ్ నడుస్తోంది. సూపర్ స్టార్ హీరోలు సైతం లోకేష్ తో మూవీ చేసేందుకు సై అంటున్నారు. దీంతో రజినీకాంత్ కూడా లేటెస్ట్ గా లోకేష్ కనకరాజు కు లక్కీ ఛాన్స్ ఇచ్చారు .

సూపర్ స్టార్ చేయబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ని లోకేశ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. దీనితో సినిమా సెట్స్ మీదకు వెళ్ళకముందే ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ అయ్యింది. అంతేకాదు రజినీ క్యారెక్టర్ గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు.

ఈ కాంబో సూపర్ హిట్టే :

2023 రజినీకాంత్‌(Rajinikanth)కు, లోకేశ్ కనకరాజ్‌(Lokesh Kanagaraj)కు మర్చిపోలేని సంవత్సరం. నెల్సన్ దిలీప్ కుమార్ Nelson dilip kumar )డైరెక్షన్ లో రజినీకాంత్ నటించిన ‘జైలర్’(jailer )మూవీ సూపర్ డూపర్ హిట్‌ అయ్యింది. దళపతి విజయ్‌(Vijay)తో లోకేశ్ చేసిన ‘లియో’ (leo)మూవీ కూడా అతిపెద్ద హిట్స్‌ సాధించింది. అలాంటిది ఈ హిట్ పేర్ కలిసి ఓ మూవీ చేస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ సినిమా పక్కాగా బ్లాక్ బస్టర్ హిట్ అని అంచనా వేస్తున్నారు. తాజాగా విడుదలైన తలైవర్ 171 (Thaliver 171)ఫస్ట్ లుక్ రజినీ లోని మాస్ మాస్ యాంగిల్ ని చూపిస్తోంది. దీనితో రజినీ పాత్ర ఎలా ఉండబోతోంది అని రకరకాల రూమర్స్ నెట్టింట్లో వినిపిస్తున్నాయి.

మాఫియా డాన్‌గా రజినీకాంత్ :

లోకేశ్ కనకరాజ్( lokesh kanakaraj )ఫేవరెట్ జోనర్ క్రైమ్ డ్రామా. క్రైమ్, డ్రగ్స్ లోకేశ్ మూవీలో కచ్చితంగా ఉంటాయని ప్రేక్షకులు సరదాగా మాట్లాడుకుంటారు. లేటెస్టుగా తలైవర్ 171 కూడా అలాగే ఉండబోతుందనే రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ మూవీలో రజినీకాంత్ ఒక మాఫియా డాన్‌గా కనిపిస్తారని టాక్ .

గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తోనే లోకేశ్ ఈ చిత్రం కూడా తీస్తున్నాడని టాక్. విదేశాలైన సింగపూర్, దుబాయ్, అమెరికా నుండి ఇండియాకు బంగారం స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది అనే ది ఈ మూవీ లీడ్.

నెగిటివ్ షేడ్స్ కూడా..

తలైవర్ 171లో రజినీకాంత్ నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తారని సమాచారం. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. కెరీర్ స్టార్టింగ్ లో రజినీకాంత్ చాలా వరకు సినిమాల్లో నెగటివ్ షేడ్స్ లో నటించారు. సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లను చేయలేదు. అయితే చాలా కాలంగా అభిమానులు ఆయన అలాంటి పాత్ర చేస్తే చూడాలని వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం తలైవర్ 171కు సంబంధించిన ఈ రూమర్స్ వైరల్ కావడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ మూవీ నుండి మరిన్ని అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

తలైవార్ 171 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్‌లో సినిమా సెట్స్‌పైకి రానున్నట్లు సమాచారం . సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ క్రేజీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (anirudh ravichandran)స్వరాలను అందించనున్నాడు.

Leave a Comment