Rajinikanth movie announced: రజని సినిమా టైటిల్ విడుదల..సినిమా ఇతివృత్తం తెలిస్తే షాకే.
సూపర్ స్టార్ రజని కాంత్ ఒక సినిమా చేస్తున్నారు అంటేనే దాని గురించి ఆయన ఫాన్స్ తో పాటు సాధారణ సినిమా ప్రేక్షకులు కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు.
ఈ క్రమం లోనే ఆయన నటిస్తున్న 170 వ సినిమా పేరు గురించి వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమాకి ఎం పేరు పెడతారా అని ఆలోచిస్తూ ఉన్నారు. అయితే అలంటి వాటన్నిటికీ రజని కాంత్ పుట్టిన రోజు నాడు తెరపడనుంది.
డిసెంబర్ 12 వ తేదీన ఆయన నటిస్తున్న 170 వ సినిమా టైటిల్ అనౌన్సమెంట్ ఉంటుంది. ఈ సినిమాను టి.జె.జ్ఞానవేల్ రూపొందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
యదార్ధ సంఘటనలను ఆధారంగా చేసుకుని చిత్రీకరిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా, ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రధారులుగా కనిపిస్తారు.
ఇక ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ అధికారి పాత్రను పోషిస్తున్నారట, పోలీస్ డిపార్ట్మెంట్ లో జరిగే బూటకపు ఎన్కౌంటర్ లకు వ్యతిరేకంగా రజని పోరాటం చేస్తూ ఉంటాడని తెలుస్తోంది.
ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ కన్యాకుమారి లో జరుగుతోంది. మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్ ముఖ్య తారాగణం గా కనిపిస్తారు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
ఇక రజని నటించిన గత చిత్రం జైలర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, 70లోకి అడుగుపెట్టాక కూడా రజని స్టయిల్ ఎంతమాత్రం తగ్గలేదు.
రజని మార్క్ ఫైట్స్ ఫాన్స్ ను, కామన్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. జైలర్ తోపాటు తాజా సినిమాలోకూడా పోలీస్ అధికారి పాత్రే పోషిస్తున్నారు కాబట్టి ఈ సినిమా లో కూడా అదే తరహా యాక్షన్ సీక్వెన్స్ లను రజని ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
పైగా అమితాబ్, రానా, ఫాహద్ ఫాజిల్ వంటి వారు ఈ సినిమాలో మెరుస్తున్నారు అంటే ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. రజని గత చిత్రం జైలర్ లో కూడా మోహన్ లాల్, శివ కుమార్, జాకీ ష్రాఫ్ వంటి వారు అతిధులుగా కనిపించి తెరపై మెరుపులు పెరిపించారు.
జైలర్ లో విలన్ పాత్ర చేసిన వినాయకన్ కు విపరీతమైన పేరొచ్చింది. మరి రజని 170 మూవీ లో విలన్ గా కనిపించబోయే ఆ లక్కీ ఫెలో ఎవరా అని అంతా ఆశక్తిగా చూస్తున్నారు.
ఇక కాలీవుడ్ తోపాటు టాలీవుడ్ లో మాస్ ఆడియన్స్ కోసం ఫైట్స్ ఎంత కంపల్సరీనో ఐటెం సాంగ్ కూడా అంతే కంపల్సరీ అందుకే రజని జైలర్ లో తమన్నా ఒక చిన్న క్యారెక్టర్ లో మెరవడమే కాక వా నువ్ కావాలయ్యా అంటూ స్పెషల్ సాంగ్ లో కనిపించి కుర్రకారును ఉర్రుతలూపింది.
మరి రజని లేటెస్ట్ మూవీ లో కూడా ఐటెం సాంగ్ ఉంటుందా ? ఉంటె ఆ ఐటెం నంబర్ లో మెరవబోయేది ఎవరై ఉంటారా అని క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.
ఇలాంటి డౌట్స్ అన్నిటికి ఆన్సర్స్ కావాలంటే సినిమా విడుదల వరకు లేదంటే కనీసం ట్రైలర్ రిలీస్ వరకు వెయిట్ చేయక తప్పదు.