Breaking News

Raju Yadav’s second song release: రాజు యాదవ్ నుండి రెండవ సాంగ్ రిలీజ్..గెటప్ శ్రీను హీరోగా రాబోతున్న చిత్రం విశేషాలు

Raju Yadav's second song release

Raju Yadav’s second song release: రాజు యాదవ్ నుండి రెండవ సాంగ్ రిలీజ్..గెటప్ శ్రీను హీరోగా రాబోతున్న చిత్రం విశేషాలు

తెలుగు బుల్లి తెరపై ప్రసారమవుతున్న ప్రముఖ కామెడీ షో జబర్దస్త్, ఈ కామెడీ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది, నటులుగా వారిని వారు నిరూపించుకునేందుకు అవకాశాన్ని కల్పించింది.

మరుగున పడిన ఎంతోమంది కళాకారులకు గుర్తింపునిచ్చింది. అయితే జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లు తరువాతి కాలంలో హీరోలుగా మరీన వారు కూడా ఉన్నారు.

వారిలో మొదటి వరుసలో ఉంటారు ధనాధన్ ధనరాజ్, అయితే కేవలం ఒకటి అరా సినిమాలకు మాత్రమే అయన పరిమితం అయిపోయారు. కానీ వేణు వండర్స్ టీమ్ లో ఎంటర్ అయ్యి టీమ్ లీడర్లు గా మరీన సుడిగాలి సుధీర్ హీరోగా బాగా నిలదొక్కుకున్నాడనే చెప్పాలి, సుధీర్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

అదే టీమ్ లో ఉన్న గెటప్ శ్రీను కి కూడా వెండితెరపై గొప్ప నటుడిగా పేరు తెచ్చుకోవాలని తపన ఉంది. కొన్ని సినిమాలలో శ్రీనుని బుక్ చేసుకున్నప్పటికీ ఎడిటింగ్ లో ఆ సన్నివేశాలను తీసేయడంతో బాధ పాడాడు కూడా.

అయితే ఎట్టకేలకు ఎడిటింగ్ లో కత్తెర పాల పడకుండా భోళా శంకర్ లో చిరు పక్కన ఎక్కువ సీన్లలో కనిపించాడు.

కానీ ఈ దఫా మాత్రం ఏకంగా శీను హీరోగా ఓ సినిమానే రాబోతోంది. అదే రాజు యాదవ్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఒక పాటను కూడా విడుదల చేశారు.

కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు బాబీ ఈ పాటని లాంచ్ చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశాడు. నన్నే చూశావే.. నువు నన్నే నన్నే చూసినవే.. నవ్వే నవ్వావే.. చిరు నవ్వుల దారి చూపినవే అంటూ ఈ పాట సాగుతుంది. ఇది మెలోడీ సాంగ్. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు నిర్మాతలు, రిలీజ్ డేట్ ను కూడా త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *