Rajya Sabha Election Schedule Released: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.

website 6tvnews template 2024 01 29T161035.432 Rajya Sabha Election Schedule Released: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.

Rajya Sabha Election Schedule Released: భారత దేశ రాజ్య సభ ఎన్నికలకు(Rajya Sabha Election) సైరన్ మోగింది. దేశ వ్యాప్తంగా మొత్తం 56స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహించనున్నారు.

అయితే ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) నుండి మూడు తెలంగాణ(Telangana) రాష్ట్రం నుండి మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుండి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ రాజ్య సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) నుండే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 10 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.

ఇక కర్ణాటక లో నాలుగు, మధ్య ప్రదేశ్(Madhya Pradesh) లో 5, పశ్చిమ బెంగాల్(Paschim Bnegal) లో ఐదు, బీహార్(Bihar) లో ఆరు, మహారాష్ట్ర(Maharashtra) లో ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.

రాజ్యసభ అంటే ఏంటి ? What Is Rajyasabha

photo 3 Rajya Sabha Election Schedule Released: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.

ఈ రాజ్యసభ గురించి చూస్తే ఇది పార్లమెంటు లోని ఎగువ సభగా పిలుస్తారు. ఈ రాజ్య సభ లో ఉండే సభ్యులను దేశంలోని వివిధ రాష్ట్రాల అసెంబ్లీలో ఉండే శాసనసభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీనిని రాష్ట్రాల సభ అని కూడా అంటారు.

ఇవి కాకుండా రాష్ట్రపతి కూడా 12 మందిని వివిధ రంగాలకు చెందిన వారిని ఎంపిక చేసి రాజ్యసభకు పెంపగలిగే సౌలభ్యం ఉంది. ఈ సాజ్హ్య సభలో ఉండే సభ్యు;ల విధివిధానాలు ఎలా ఉంటాయంటే శాసన అధికారం కలిగిన వీరు రాజ్యాంగంలో చేసే సవరణలను విజ్ఞాతితో ఆలోచించి ఆమోదించాల్సి ఉంటుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాజ్యసభ అనేది కేంద్రం లో అహీకారంలో ఉన్న ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా మన దేశానికి సంబంధించిన అనేక ముఖ్య విషయాలను సభ్యులు ఈ సభలో చర్చిస్తారు. అక్కడ జరిగిన చారహోపచర్చల అనంతరం ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తారు.

లోక్ సభ కి రాజ్య సభకి తేడా ? Difference Between Lok Sabha And Rajya Sabha

96ddc01d17683e9d0be876f6bba0b0c2 Rajya Sabha Election Schedule Released: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.

ఇక లోక్ సభ కి రాజ్య సభకి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే లోక్ సభలోని సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. రాజ్య సభ సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలైతే, లోక్ సభ సభ్యుని పదవీకాలం 5 సంవత్సరాలు. రాజ్య సభకు సభాపతిగా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. లోక్ సభలోని సభ్యులు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తే రాజ్య సభ సభ్యులు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు.

Leave a Comment