Rakul Preet Singh Follows Modi request : సోలో లైఫ్ కి బై బై చెప్పేసి త్వరలో ఓ ఇంటిది కాబోతోంది స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Sing). బాలీవుడ్ నిర్మాత , నటుడు జాకీ భగ్నానీ(Jackky Bhagnani)తో పెళ్లికి రెడీ అయ్యింది ఈ భామ. త్వరలో ఈ ప్రేమ పక్షులు పెళ్లి బంధంతో కొత్త లైఫ్‌ను స్టార్ట్ చేయబోతున్నారు.
గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్లి వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. రకుల్, జాకీ ఇద్దరూ ఈ ఫిబ్రవరిలోనే ఒకటి కాబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది.
అంతే కాదు వీరి వెడ్డింగ్ కి సంబంధించి కొత్త కొత్త అప్డేట్స్ అందిస్తున్నారు. రకుల్, జాకీ పెళ్లి ఫిబ్రవరి 22న జరగనుందని సమాచారం. ఈ లవ్ బర్డ్స్ పెళ్లి వేడుక రెండు రోజుల పాటు జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా పూర్తి అవుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
అయితే ఈ జోడీ ముందుగా తమ పెళ్లిని ఫారెన్ కంట్రీలో గ్రాండ్ గా ప్లాన్ చేశారట. కానీ ఇంతలో ఏమైందో ఏమో కానీ ఆ ప్లాన్ ని పక్కన పెట్టి వెడ్డింగ్ డెస్టినేషన్ మార్చేశారట.
PM Modi Impact on Rakul : రకుల్‌పై ప్రధాని మోదీ ప్రభావం
చాలా రోజుల లవ్ జర్నీ తర్వాత ఈ ప్రేమ పక్షులు తమ పెళ్లిని చాలా గ్రాండ్ గా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రకుల్ ప్రీత్ (Rakul Preet Sing),జాకీ భగ్నానీ (Jackky Bhagnani)మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో వెడ్డింగ్ డెస్టినేషన్ (Wedding Destination)ని ప్లాన్ చేశారు.
ఫారెన్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ జంట డిసెంబర్ నుంచే పెళ్లి పనులు స్టార్ట్ చేసింది. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లను స్టార్ట్ చేశారు. ఆర్డర్లు ఇవ్వడంతో పాటు అతిథులను ఆహ్వానించి వారి అకామిడేషన్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లను డిసెంబర్ నుంచే ఫాలోఅప్ చేస్తున్నారు.
కానీ అప్పుడు దేశ ప్రధాని (Prime Minister)నరేంద్ర మోదీ(Narendra Modi) చెప్పిన మాటలు వారిపై బాగా ప్రభావం చూపించాయని సన్నిహితులు తెలిపారు. భారత్ లోనే చాలా అందమైన లొకేషన్స్ ఉన్నాయని, వివాహాలు, వేడుకలు ఇక్కడే చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రకుల్, జాకీలు కూడా తమ పెళ్లిని భారత్ లోనే చేసుకోవాలని ఫైనల్ గా డిసైడ్ అయ్యారు.
వాస్తవానికి పెళ్లికి సంబంధించి అన్ని అడ్వాన్స్‌లు ఇచ్చారు. ప్లాన్ చేశారు. ఆర్డర్స్ ఇచ్చేశారు. కానీ, దేశం మీద ఉన్న ప్రేమతో.. వారిద్దరూ తమ వెడ్డింగ్ డెస్టినేషన్ ను ఫారెన్ కంట్రీస్ నుంచి భారత్‌కు మార్చుకున్నారని తెలుస్తోంది.
Grand wedding in Goa: గోవాలో గ్రాండ్ గా పెళ్లి
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Sing),జాకీ భగ్నానీ(Jackky Bhagnani)ల పెళ్లి గోవాలో జరగే ఛాన్స్ ఉందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. మాల్డీవ్స్ (Maldives)తో గొడవల నేపథ్యంలో మోదీ లక్షద్వీప్(Lakshadweep)కి వెళ్లి అక్కడ ఫొటో షూట్ చేసిన సంగతి తెలిసిందే. మన భారత్ లోనే ఎన్నో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయని స్వయంగా మోదీ (Modi) ప్రమోట్ చేయడంతో చాలా మంది ఇప్పుడు మాల్దీవ్స్ కి బదులు లక్షద్వీప్ వెళ్తున్నారు.
ఈ క్రమంలో రకుల్ కూడా మోదీ మాటలకు బాగా ఇన్స్పైర్ అయ్యిందట. అందేరూ గోవా (Goa)లో పెళ్లికి ప్లాన్ చేస్తోంద. ఫిబ్రవరి 22న గోవాలో వీరిద్దరి పెళ్లి జరుగుతుందని సన్నిహితులు చెబుతున్నారు. క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ని మాత్రమే ఈ వెడ్డింగ్ కు ఆహ్వానిస్తున్నారట. ఈ వివాహాన్ని అతి కొద్ది మంది ఆప్తుల సమక్షంలో పసందైన పాటలతో ఆహ్లాదకరంగా జరిగే విధంగా భారీ ఎత్తున ప్లాన్ చేస్తోందంట ఈ జంట. ఇక బడా సెలబ్రిటీ జంటల పెళ్లిలకు వీడియోగ్రాఫర్‌గా వ్యవహరించిన విశాల్ పంజాబి(Vishal Punjabi) వీరి వెడ్డింగ్ ను కూడా వీడియో తీయబోతున్నాడట.
వీరిద్దరి మీటింగ్, డేటింగ్ నుంచి ఇప్పుడు పెళ్లివరకు జరిగిన మూమెంట్స్ అన్నీ వచ్చేలా ఓ ప్రత్యేకమైన పాటను కూడా చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారట రకుల్ , జాకీ జంట. ఇక ప్రస్తుతం రకుల్ సినిమా షూటింగ్స్‌లో బీజీగా ఉంది. ఇండియన్ – 2 (Indian 2), అయాలన్ (Ayalaan)వంటి సినిమాల్లో ఈ భామ నటిస్తోంది.
మరోవైపు జాక్కీ..బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్‌కుమార్ (Akshay Kumar), టైగర్ ఫ్రాఫ్ (Tiger Shroff)తో కలిసి ‘బడే మియాన్ చోటే మియాన్’ అనే సినిమా చేస్తున్నాడు. మరి వెడ్డింగ్ టైం దగ్గర పడుతుండటంతో ఈ సినిమాలు పూర్తి చేసి పెళ్లి చేసుకుంటారో లేక వాటికి కాస్త విరామం ఇస్తారో తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే.