నువ్వు నా సొంతం.. పెళ్లి ఫోటోలు షేర్ చేసిన రకుల్.

website 6tvnews template 76 నువ్వు నా సొంతం.. పెళ్లి ఫోటోలు షేర్ చేసిన రకుల్.

Rakul shared her wedding photos : రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh ), జాకీ భగ్నానీలు (Jackky Bhagnani) వివాహ బంధం తో ఒక్కటయ్యారు. ITC గ్రాండ్ సౌత్ గోవా (Goa ) హోటల్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ జాకీ భగ్నానీ రకుల్‌ మెడలో మూడుమూళ్లు వేశాడు. ఈ వేడుకలో.

బాలీవుడ్‌ సినీ సెలబ్రిటీలు అక్షయ్ కుమార్ (Akshay Kumar ) , టైగర్ ష్రాఫ్ (Tiger Shroff ) , శిల్పా శెట్టి (Shilpa Shetty ) రాజ్ కుంద్రా (Raj Kundra ), అర్జున్ కపూర్( Arjun Kapoor ) ఆయుష్మాన్ ఖురానా( Ayushman Khurana ) వంటి తారలు అటెండ్ అయ్యి వధూవరులకు విషెస్ తెలిపారు.

Rakul Awesome in pink lehenga : పింక్ లెహంగాలో రకుల్ అదుర్స్ :

గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh ), పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. నెట్టింట్లో ఎక్కడ చూసినా అమ్మడి పెళ్లి వేడుకలకు సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం రకుల్‌ పెళ్లిలో వాలిపోయింది. నటి రకుల్‌, బాలీవుడ్‌ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ(Jackky Bhagnani)ల డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ గోవా (Goa ) లో గ్రాండ్ గా జరిగింది. మూడేళ్ల ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టి ఏడడుగులు వేసి పెళ్లి బంధంతో ఈ జంట ఒక్కటైంది.

రకుల్ ప్రీత్ సింగ్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో పెళ్లి ఫోటోలను షేర్ చేసింది. ఈ వెడ్డింగ్ కోసం రకుల్ అపురూపమైన వజ్రాలతో పొదిగిన లేత గులాబీ రంగు లెహంగా ధరించింది. ఈ లెహంగాకు తగ్గట్లుగా భారీ ఆభరణాలను అలంకరించుకుని పెళ్లి బట్టల్లో ఎంతో అద్భుతంగా కనిపించింది. ఇక వరుడు జాకీ క్రీమ్-గోల్డెన్ షేర్వానీని ధరించాడు. దీనికి మ్యాచింగ్ గా ఒక భారీ నెక్లెస్‌ అలంకరించుకున్నాడు.

Mine Now Forever : నువ్వు నా సొంతం.. ఇప్పటికీ..ఎప్పటికీ

మొదటినుంచి రకుల్(Rakul Preet Singh ),జాకీ (Jackky Bhagnani) జంట తమ పెళ్ళికి సంబంధించిన న్యూస్ ను సీక్రెట్ గానే ఉంచింది. పెళ్లి డేట్ దగ్గర నుంచి వెన్యూ వరకు అన్నిటినీ సీక్రెట్ గా మెయింటెన్ చేసింది. ఇప్పటివరకు రకుల్ జాకి పెళ్లికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

ఈ లవ్ బర్డ్స్ హల్దీ వేడుకలకు సంబంధించిన పిక్స్ వైరల్ కావడంతో వీరి పెళ్లి జరిగిందన్న వార్తలు నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. బుధవారం మధ్యాహ్నం తన ప్రియుడు జాకీ ని పెళ్లి చేసుకున్న రకుల్ పెళ్లి ఫోటోలు షేర్‌ చేసి అధికారికంగా అనౌన్స్ చేసింది. రకుల్‌ తన పెళ్లి ఫొటోలు షేర్‌ చేయడమే కాదు నువ్వు నా సొంతం.. ఇప్పటికీ.. ఎప్పటికీ.. అంటూ హార్ట్‌ ఎమోజీని జతచేస్తూ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చింది. దీనితో ప్రస్తుతం రకుల్‌ వెడ్డింగ్ పిక్స్ సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Rakul Preet Singh, Jackky Bhagnani, Wedding Photos, Rakul Wedding Photos,Rakul-Jackky Bhagnani wedding, Telugu News, Entertainment, tollywood, bollywood, film news,

Leave a Comment