అనంత్ అంబానీ(Anant Ambani ), రాధిక మర్చంట్ (Radhika Marchant )పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బాలీవుడ్, హాలీవుడ్ నుంచి సినీ సెలబ్రిటీలు, బిజినెస్ టైకూన్స్ తో పాటు ప్రపంచం నలుమూలల నుండి అతిథులు గుజరాత్ (Gujarat)లోని జామ్ నగర్(Jaam Nagar ) కు చేరుకుంటున్నారు. నిన్నటినుంచే జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. అమెరికన్ పాప్ సింగర్ రిహన్నా(Rihanna) ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా అదిరిపోయే పర్ఫామెన్స్ తో అతిథులను ఆకట్టుకుంది.
ఇప్పటికే మెటా CEP మార్క్ జుకర్‌బర్గ్(Mark Jukerberg ) ఆయన భార్య ప్రిసిల్లా చాన్(pricilla Chaan ) తో సహా ప్రపంచ ప్రముఖులు ఇప్పటికే వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు 2000 మంది అతిథుల జాబితాలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ ( Ramcharan )నాగార్జున(Nagarjuna), వంటి వారు ఉన్నారు. పెళ్లి పిలుపు అందటంతో రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ప్రత్యేక ఎయిర్ లైన్స్ లో జామ్‌నగర్‌కు వెళ్లారు. వారి ఫోటోలు ఇంటర్నెట్‌లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అనంత్ పెళ్లిలో బాలీవుడ్ సెలబ్రిటీలు :
అనంత్ అంబానీ(Anant Ambani ), రాధికా మర్చంట్(Radhika Marchant )ల పెళ్లి భారత చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో జరుగుతుంది. దాదాపు 1000 కోట్ల రూపాయలతో అంబానీ ఫ్యామిలీ పెళ్లి జరిపిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్,హాలీవుడ్ అన్న తేడా లేకుండా సినీ సెలబ్రిటీలను, ప్రముఖ కంపెనీల సీఈఓ లను ఈ పెళ్ళికి ఆహ్వానించారు. ఈ ఆహ్వానంతో గుజరాత్ కు బాలీవుడ్ తారలు క్యూ కట్టారు.
స్టార్ హీరోలు అమీర్ ఖాన్(Amir Khan ), సైఫ్ అలీఖాన్(Saif Ali khan ), కరీనా కపూర్ (Kareena Kapoor ), సారా అలీఖాన్(Sara Ali Khan ), ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే(Ananya Pandey ), దిశా పటానీ(Disha Patani ), ఎంఎస్ ధోనీ, సాక్షి పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు. తమిళ దర్శకుడు అట్లీ(Atlee), ప్రియ, అజయ్ దేవగన్ కుటుంబం, బిల్ గేట్స్(Bill Gates ), సల్మాన్ ఖాన్(Salman Khan ), షారుఖ్ ఖాన్, సుహానా , రోహిత్ శర్మ, అక్షయ్ కుమార్(Akshay Kumar ) సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar ), సైనా నెహ్వాల్, సునీల్ శెట్టి, వరుణ్ ధావన్, అనిల్ కపూర్ తదితరులు వేదిక వద్దకు చేరుకున్నారు.
రామ్ చరణ్ ప్రాజెక్ట్స్ ఇవే :
ప్రస్తుతం శంకర్ (Shankar )డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్(Game Changer )మూవీ చేస్తున్నాడు చరణ్. ఈ మూవీ లో కియారా అద్వానీ (KiaraAdvani) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తి కాగానే ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు(Buchhi Babu)తో ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేయబోతున్నాడు. గ్రామీన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియన్ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ (ShivaRajkumar) కీలక పాత్రలో కనిపించునున్నారు.