గ్లోబల్ స్టార్ బర్త్ డే – మెగా బ్లడ్ బ్యాంక్ – దిల్ రాజు హాజరు – బ్లడ్ డొనేట్ చేస్తారా ?

WhatsApp Image 2024 03 23 at 3.07.17 PM గ్లోబల్ స్టార్ బర్త్ డే - మెగా బ్లడ్ బ్యాంక్ - దిల్ రాజు హాజరు - బ్లడ్ డొనేట్ చేస్తారా ?

చిరుత(Chiruta) సినిమాతో తెరంగేట్రం చేసిన రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej) నిజంగానే చిరుత వేగంతో ఇండస్ట్రీలో దూసుకెళుతున్నారు. కెరియర్ తొలినాళ్లలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్న చరణ్ అనతికాలంలోనే వాటిని అధిగమించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో గ్లోబల్ స్టార్(Global Star) గా గుర్తింపు దక్కించుకుని మరో మెట్టు ఎక్కాడు చెర్రీ.

ప్రస్తుతం రామ్ చరణ్ పుట్టినరోజు దగ్గరపడుతోంది, చెర్రీ మార్చ్ నెలలోనే పుట్టాడు. ఈ నెల 27నే చరణ్ బర్త్ డే జరుపుకోబోతున్నాడు. మరి తమ అభిమాన హీరో బర్త్ డేని ఫాన్స్ ఎలా సెలెబ్రేట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాలా ? అన్నిటికన్నా ముఖ్యంగా మెగాస్టార్ చిరు(Megastar Chiranjeevi) చూపించిన బాటలోనే నడుస్తారు ఫాన్స్, కాబట్టే చరణ్ పుట్టినరోజుసందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్(Mega Blood Donation Drive) ను నిర్వహించడానికి రెడీ అయ్యారట. మార్చ్ 24వ తేదీ ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్లాంక్(Chiranjeevi’s blood is blank) లో ఈ కార్యక్రమాన్ని షురూ చేస్తారని సమాచారం.

WhatsApp Image 2024 03 23 at 3.07.34 PM గ్లోబల్ స్టార్ బర్త్ డే - మెగా బ్లడ్ బ్యాంక్ - దిల్ రాజు హాజరు - బ్లడ్ డొనేట్ చేస్తారా ?

ఈ సత్కార్యానికి దిల్ రాజు(Dill Raju) ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు, అంతే కాక అయన చేతులమీదుగానే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అయితే దిల్ రాజు కూడా బ్లడ్ డొనేట్ చేస్తారా లేదా అనేది చుడాలి. ప్రస్తుతం చరణ్ దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లోనే గేమ్ చెంజర్(Game Changer) సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు శంకర్(Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు.

చరణ్ కి జోడీగా ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ(Kiara Advani), అచ్చతెలుగు అమ్మాయి అంజలి(Anjali) నాయికలుగా నటిస్తున్నారు. దిల్ రాజు ఖర్చు విషయంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా ఈ సినిమాను ప్రెస్టీజియస్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావలసి ఉన్నప్పటికీ శంకర్ ఇండియన్ 2(Indian 2) షూట్ కి షిఫ్ట్ అవ్వడంతో లేట్ అయింది. ఆ విషయంలో చరణ్ ఫాన్స్ శంకర్ పై గుర్రుగానే ఉన్నారు కూడా.

ఇక శంకర్ మాత్రం చరణ్ ను ఈ సినిమాలో చాల డిఫరెంట్ గా చూపెడుతున్నారు. అందుకు తగ్గట్టే చెర్రీ లుక్, టైటిల్ గ్లిమ్ప్స్ కు చరణ్ ఫాన్స్ మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. మరోవైపు చెర్రీ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమానుండి ఒక అప్డేట్ రాబోతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇది ఇలా ఉంటె చరణ్ బుచ్చి బాబు సానా(Buchhibabu Sana) కంబోలో ఒక చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవి(Sridevi) పెద్ద కుమార్తె జాన్వీ కపూర్(Janhvi Kapoor) నాయికగా ఎంపికైంది. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Leave a Comment