Ram Charan Patch Up With ISPL : ఐఎస్.పి.ఎల్ తో జత కట్టిన రామ్ చరణ్.
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ (Mega Power Star, Global Star,) రామ్ చరణ్ (Ram Charan) ఒక కొత్త విషయాన్నీ ప్రకటించారు. ఇప్పటివరకు సినిమాలు (Movies), వ్యాపారాలు (Business), సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్న చెర్రీ ఇప్పుడు స్పోర్ట్స్(Sports) వైపు పూర్తి స్థాయిలో అడుగు పెట్టబోతున్నారు. అదేంటి రాంచరణ్ క్రికెట్(Cricket) లోకో ఫుడ్ బాల్(Foot Ball) లోకో వెళ్లబోతున్నాడు అనుకోకండి, ఆయన సినిమాల్లోనే(Movies) నటిస్తారు, కానీ రామ్ చరణ్ ఇప్పుడు కొత్తగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ తో(Indian Street Premier League) జత కట్టాడు. ఈ టెన్నిస్ బాల్ టి 20 లో(Tennis Ball టీ T20) చరణ్ తరుపున హైదరాబాద్ టీమ్(Hyderabad Team) బరిలోకి దిగనుంది. అంటే చెర్రీ హైదరాబాద్ టీమ్ ను సొంతం చేసుకున్నాడు. భారత దేశంలో తొలిసారిగా జరగనున్న టెన్నిస్ బాల్ టి 20 ఇదే కావడం విశేషం.
ముంబై (Mumbai), బెంగుళూరు(Banglore), చెన్నై(Chennai), కోల్కతా(Kolkata), శ్రీనగర్(Srinagar) జట్లతోపాటు హైదరాబాద్(Hyderabad) జట్టు కూడా ఆరంభ ఎడిషన్ లో బరిలోకి దిగుతోంది. ఈ లీగ్ మార్చ్ 2వ టీడీ నుండి మార్చ్ 9వ తేదీ వరకు ముంబై(Mumbai) లో నిర్వహించబడుతుంది అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే హైదరాబాద్ జట్టు(Hyderabad) యజమానిగా తాను ఉండబోతున్నాను అంటూ రామ్ చరణ్ స్వయంగా ఎక్స్(X) వేదికగా ప్రకటించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే చరణ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్(Shankar) దర్శకత్వంలో గేమ్ చెంజర్ లో(Game Changer) నటిస్తున్నారు.
ఈ సినిమాను దిల్ రాజు(Dil Raju) శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్(Sri Venkateswara Productions Banner) మీద నిర్మిస్తున్నాడు. కమల్(Kamal) నటిస్తున్న భారతీయుడు 2(Indian 2) సినిమా షూటింగ్ పోస్ట్ ఫోన్ అవ్వడం, మరల కమల్ ఆ సినిమా షూట్ కి డేట్స్ ఇవ్వడం వల్ల శంకర్(Shankar) ఆ పనుల్లో బిజీ అయ్యి కొన్నాళ్ల పాటు గేమ్ చెంజర్(Game Changer) ను పక్కన పెట్టాడు. అయితే ఇప్పుడు గేమ్ చెంజర్ ను శంకర్ శరవేగంగా చిత్రీకరిస్తున్నట్టు ఫిలిం నగర్(Filim Nagar) వర్గాల టాక్. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ(Kiyara Advani) ఆడిపాడబోతోంది. సినిమాకి ఎస్ ఎస్ థమన్(స్ Thaman) సంగీతాన్ని(Music) సమకూరుస్తున్నాడు. సాధారణంగా శంకర్ సినిమాలకి ఏ ఆర్ రెహ్మాన్(AR Rehman) సంగీతాన్ని అందిస్తారు, అయితే ఈభారీ ప్రాజెక్టు కి సంగీతాన్ని అందించే చాన్స్ థమన్ దక్కించుకున్నాడు.