Ram Charan-upasana : గ్లోబల్ స్టార్ అయినా భార్యకు దాసుడే

website 6tvnews template 2024 03 02T141006.082 Ram Charan-upasana : గ్లోబల్ స్టార్ అయినా భార్యకు దాసుడే

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli )తీసిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan ) కాస్త గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఈయన ఈ సినిమాలో చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ కి వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు చరణ్.

దీంతో చరణ్ సినిమాల కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ విషయం కాస్త పక్కన పెడితే ఎంత పెద్ద గ్లోబల్ స్టార్ అయినా తన భార్యకు మాత్రం దాసుడినే అని రామ్ చరణ్ మరోసారి ఓ ఇన్సిడెంట్ తో నిరూపించాడు. తన వీడియో ద్వారా భార్యాభర్తలు ఎలా ఉండాలో హితబోధ చేస్తున్నాడు.

భార్య కాళ్లు పట్టుకున్న చరణ్ :

అప్పట్లో ఆర్ఆర్ఆర్ (RRR) ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ ( Ram Charan ) జపాన్, (Japan)వెళ్లాడు. తనతో పాటు తన భార్య ఉపాసన(Upasana) ను కూడా జపాన్ తీసుకెళ్లాడు. ప్రమోషన్స్ ముగిసాక కాస్త ఫ్రీ టైం దొరకడంతో భార్యతో షాపింగ్ చేసిన చరణ్ ఆమె షాపింగ్ బ్యాగ్స్ మోస్తూ కనిపించాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.

ఇక ఇప్పుడేమో ఏకంగా ఎయిర్ లైన్స్ లో తన భార్య పాదాలను పట్టుకుని అందరినీ అవాక్కు చేశాడు చరణ్. పాపం ఉపాసన అలసిపోయిందనుకుంట దీంతో ఆమెను రిలాక్స్ చేసేందుకు తన పాదాలను పట్టుకున్నాడు. అంతేకాదు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో వైరల్ అవుతోంది. భర్త అంటే ఇలా ఉండాలి అంటూ అమ్మాయిలు కామెంట్ చేస్తున్నారు.

ఉపాసన(Upasana ), రామ్ చరణ్(Ramcharan ) ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఓకే కాలేజీలో చదువుకున్నారు అక్కడే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. చాలా కాలం ప్రేమలో ఉన్న వీరు.. 2012 జూన్ 14న పెళ్లి చేసుకున్నారు.ఉపాసన అపోలో హాస్పిటల్ (Apollo Hospital ) ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి (pratap reddy ) మనవరాలు. ఉపాసన చరణ్ పెళ్లి జరిగి 12 ఏళ్ల అవుతోంది.

గత ఏడాది జూన్ 20న మెగా వారసురాలు ఇంట్లోకి అడుగుపెటింది. చిరంజీవి(Chiranjeevi) మనవరాలికి క్లీంకార(Klinkara )అని పేరు పెట్టారు. వీరి వివాహం జరిగి 12 ఏళ్లు అయినా ఇంకా లవ్ బర్డ్స్ లానే ఉన్నారు. చరణ్ కెరీర్ కు ఎంతో సపోర్ట్ ఇస్తుంది ఉపాసన.

ఉపాసనకు అంతే వాల్యూ ఇస్తాడు చరణ్. షూటింగ్స్ లేని సమయంలో ఆమెకు నచ్చిన వంటకాలను వండి మరీ వడ్డిస్తుంటాడు. అయితే ఇదంతా కూడా మెగాస్టార్ చిరంజీవి నుంచి నేర్చుకున్నాడని చెప్పక తప్పదు. ఎందుకంటే చిరంజీవి కూడా వీలు దొరికినప్పుడల్లా వంటింట్లోకి దూరి మరి తన తల్లికి, భార్య సురేఖ(Surekha )కు నచ్చిన వంటకాలను రెడీ చేసి వడ్డిస్తూ ఉంటారు. ఎంతైనా ఈ వీడియోతో భర్త అంటే ఇలా ఉండాలి అంటూ అమ్మాయిలు ఫిక్స్ అయిపోతున్నారు.

Leave a Comment