అనంత్ అంబాని ప్రీ వెడ్డింగ్ లో రామ్ చరణ్ కు ఘోర అవమానం

2JcuYSim news post 2 660x330 1 అనంత్ అంబాని ప్రీ వెడ్డింగ్ లో రామ్ చరణ్ కు ఘోర అవమానం

దేశం లోనే ఆగర్భ శ్రీమంతుడు గా ఉన్న ముకేష్ అంబాని ఇటీవల తన చిన్న కుమారుడి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అంగ రంగ వైభోగం గా జరుగుతున్నాయి. దేశ విదేశాల నుండి అతిరధ మహారధులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు.

దీనికోసం ముకేష అంబాని దాదాపు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రీ వెడ్డింగ్ కోసం దేశం లో ఉన్న ప్రముఖుల కు ఆహ్వానాలు అందాయి. ఇందులో బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ కూడా ఆహ్వానాలు అందాయి.

మన టాలీవుడ్ కు తీసుకుంటే మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కు ఆహ్వానం అందింది. దీనికోసం ఆయన తన భార్య ఉపాసన తో పాటు ఈ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. బాలీవుడ్ చెందిన నటీనటులు వివిధ రకాల డాన్స్ లతో అలరించడం జరుగుతోంది. ఇదే సమయం లో స్టేజ్ మీద షారుఖ్ ఖాన్ ఒక డాన్సు చేస్తూ రామ్ చరణ్ ని స్టేజ్ మీదకి ఆహ్వానం పలుకుతూ ఇలా అన్నారు ప్లీజ్ కం ఇడ్లి సాంబార్ అని ఆహ్వానించాడుట.

ఈ విషయాన్ని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జేబా హసన్ X లో పోస్ట్ చేసింది. చరణ్ సార ని అలా పిలవడం నాకు నచ్చలేదని ఆవిడ పోస్ట్ చేసారు. సౌత్ ఇండియా అంటే షారుఖ్ కి అంత చులకన ఉందేమో అని మండి పడుతున్నారు చరణ్ ఫ్యాన్స్.

Leave a Comment