Shah Rukh Khan-Ram in Dhoom 4: షారుఖ్‎తో రామ్ చరణ్…ఇక రికార్డులు బ్రేకే.

Add a heading 2023 12 30T125233.676 Shah Rukh Khan-Ram in Dhoom 4: షారుఖ్‎తో రామ్ చరణ్…ఇక రికార్డులు బ్రేకే.

Shah Rukh Khan-Ram in Dhoom 4: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది. అందులోనూ బాలీవుడ్ లో దుమ్ముదులిపిన ధూమ్ 4 సినిమా ఇద్దరూ కలిసి చేస్తే ఎలా ఉంటుంది?

అబ్బా ఆ ఊహే అద్భుతంగా ఉది కదా. ఫ్యాన్స్ డోండ్ వర్రీ ఇది త్వరలో నిజమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ దొంగా పోలీసు ఆట ఆడేందుకు రెడీ అవుతున్నారు.

ఒకే స్క్రీన్‎పై తమ ఫేవరేట్ స్టార్స్ కనిపిస్తే ఇంకేముంది ఫ్యాన్స్‎కి ఒకరకంగా పండగే అని చెప్పాలి. పాన్ ఇండియా సినిమాల పుణ్యమా సౌత్ , నార్త్ అన్న అడ్డుగోడ తొలగిపోయింది.

స్టార్ హీరోల కాంబినేషన్‎లో పాన్ ఇండియన్ సినిమాల లిస్ట్ పెరిగిపోతోంది. ఇదే క్రమంలో ఇప్పుడు షారుక్, చరణ్ కాంబినేషన్ ఊహకందనిది విషయం ఏమి కాదు. కానీ వీరిద్దరు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఆ రచ్చ మామూలుగా ఉండదంటున్నారు అభిమానులు.

political thriller game changer: పొలిటికల్ థ్రిల్లర్‎గా గేమ్ ఛేంజర్

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. అందులోనూ ఈ మూవీలోని సాంగ్ కి ఆస్కార్ అవార్డ్ రావడంతో ఈ యంగ్ స్టార్ కి వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ వచ్చింది.

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నాడు రామ్. దిల్ రాజు ప్రొడ్యూసర్‎గా రూపొందుతున్న ఈ మూవీ పొలిటికల్ థ్రిల్లర్ రాబోతోంది.

ఊరంగా రూ.300 కోట్ల భారీ బడ్జెట్‎తో ఈ సినిమాను తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ హంగామా పూర్తిగానే రామ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ స్టార్ట్ చేశాడు.

అయితే ఎందుకో తెలియదు కానీ సినిమా షూట్ చాలా స్లోగా ముందుకు సాగుతోంది. ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. రీసెంట్ గా ప్రొడ్యూసర్ దిల్ రాజే ఈ విషయాన్ని తెలిపారు.

గేమ్ ఛేంజర్ తర్వా రామ్ ఉప్పెన మూవీ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడు. ఇదే క్రమంలో ఇప్పుడు రామ్ షారుక్ కాంబినేషన్ లో ధూమ్ 4 రాబోతోందన్న వార్త నెట్టింట్లో జోరుగా వినిపిస్తోంది.

Ram Charan in Dhoom 4 : ధూమ్ 4 లో రామ్ చరణ్

తాజాగా రామ్ చరణ్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లోబల్ స్టార్ మరోసారి బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

‘తుఫాన్’తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన చెర్రీ, డిజాస్టర్ ను చవి చూశారు. ఈ సినిమా తర్వాత మళ్లీ అటువైపు చూడలేదు. రీసెంట్ గా సల్మాన్ మూవీలోని ఓ పాటలో కనిపించాడు.

ఆ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ, ఇప్పుడు పాపులర్ ఫ్రాంచైజీ ‘ధూమ్ 4’లో నటించబోతున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది.

Ram Charan in abhishek place: అభిషేక్ స్థానంలో రామ్ చరణ్

ధూమ్‌ సినిమా బాలీవుడ్ లో ఏ రేంజ్ లో దుమ్ముదులిపిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో యశ్ రాజ్ ఫిల్స్మ ధూమ్ ఫ్రాంఛైజీలో మూడు సినిమాలు తీశారు.

ఇక 2013లో విడుదలైన ధూమ్ 3 కూడా థియేటర్లలో ఇరగదీసింది. ఇప్పుడు అదే ధూమ్‌ 3 కి సీక్వెల్ గా యశ్ రాజ్ ధూమ్ 4 తీయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన డిస్కషన్ ను మేకర్స్ మొదలు పెట్టారు.

ఇప్పటివరు ఈ ఫ్రాంఛైజీలో విడుదలైన ధూమ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోలు జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ నటించారు. వారి పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ ఊగిపోయారు.

ఇక లేటెస్టుగా ధూమ్ 4 లో పోలీస్ పాత్రకు రామ్ చరణ్ ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దక్షిణ చిత్ర పరిశ్రమలో రామ్ కి ఉన్న క్రేజ్ ను వాడుకోవాలని భావిస్తున్నారట.

ఈ క్రమంలో మేకర్స్ ఇప్పటికే చెర్రీతో చర్చలు కూడా స్టార్ట్ పెట్టినట్లు సమాచారం. దూమ్ 3ని తెరకెక్కించిన విజయ్‌ కృష్ణ ఆచార్య (Vijay krishna acharya)ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నట్లు టాక్.

ఇదిలా ఉంటే మరోవైపు ఈ ధూమ్ 4 కోసం మేకర్స్ ఇప్పటి వరకు షారుఖ్ ను సంప్రదించలేదనే న్యూస్ వస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.

Leave a Comment