రామ్ చరణ్‎కు ‘గేమ్ చేంజర్’ నుంచి అదిరిపోయే గిఫ్ట్

website 6tvnews template 2024 03 06T120519.605 రామ్ చరణ్‎కు 'గేమ్ చేంజర్' నుంచి అదిరిపోయే గిఫ్ట్

Ram Charan’s birthday gift from ‘Game Changer’ : గ్లోబల్ స్టార్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan),కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ శంకర్ (Shankar)కాంబినేషన్ లో వస్తున్న మూవీ గేమ్ చేంజర్ (Gamechanger).ఈ మూవీలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ మూవీని నిర్మాత దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఆర్ ఆర్ఆర్ (RRR)తర్వాత చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

బర్త్ డే గిఫ్ట్ అదుర్స్ :

ఆర్ఆర్ఆర్(RRR)తో వచ్చిన స్టార్ డమ్తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా మారిపోయాడు. దీంతో చరణ్ అప్ కమింగ్ మూవీ కోసం ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఎందుకంటే ఇప్పటి వరకు శంకర్ డైరెక్షన్ లో వచ్చిన చాలా వరకు సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ సినిమాలే. అన్నీ స్టార్ హీరో సినిమాలే. దీంతో ఈ మూవీకి సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే గత కొంత కాలంగా సినిమాకు సంబంధిం ఎలాంటి అప్డేట్స్ లేవు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అప్పుడెప్పుడో జరగండి.

జరగండి అనే సాంగ్ విడుదల చేస్తామని మేకర్స్ చెప్పారు. కానీ ఇప్పటీ ఆ సాంగ్ రానేలేదు. అయితే తాజాగా ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ కు మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. చరణ్ బర్త్ డే రోజున జరగండి అనే సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్ జే సూర్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

రామ్ చరణ్ ప్రాజెక్ట్స్ ఇవే :

ప్రస్తుతం శంకర్ (Shankar )డైరెక్షన్ లో గేమ్ ఛేంజ‌ర్(Game Changer )మూవీ చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ మూవీ లో కియారా అద్వానీ (KiaraAdvani) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తి కాగానే ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు(Buchhi Babu)తో ఓ RC16 అనే టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నాడు. ఆ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతోంది.

ఎక్కువ భాగం గ్రామీన నేపథ్యంలోనే ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను పాన్ ఇండియ‌న్ లెవెల్ లో తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ . అందుకే క‌న్న‌డ స్టార్ హీరో శివ‌రాజ్‌కుమార్ (ShivaRajkumar) ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్రలో కనిపించునున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ గా దివంగత నటి శ్రీదేవి (Sridevi)పెద్ద కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కనిపిస్తుందని టాక్ టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది.

Leave a Comment